బ్రహ్మముడి సీరియల్ : ఆస్తి కోసం కక్కుర్తి, రుద్రాణికి చెంప దెబ్బ, కళ్యాణ్ కోసం అప్పు తిప్పలు..!
కావ్య అందరికీ కాఫీ ఇస్తుండగా, అందరూ కాఫీ తాగడానికి కూడా ఇష్టపడరు. అందరినీ అడిగినా, అందరూ వద్దని చెప్పేస్తారు. దీంతో, కాఫీ కప్పులు తీసుకొని కావ్య వెళ్లిపోతూ ఉంటుంది.
Brahmmamudi
Brahma mudi Serial: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి. ఎపిసోడ్, ఎపిసోడ్ కీ ఆసక్తికరంగా మలుస్తున్నారు. స్వప్న కడుపు డ్రామా బయటపడటం, అందరూ కావ్యను దోషిగా చూడటం తెలిసిందే. ఈ విషయం తర్వాతే సీతారమయ్య అనారోగ్య సమస్య కూడా బయటపడింది. దీంతో, రాజ్ కుటుంబం మొత్తం బాధలో ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ కూడా ఇక్కడి నుంచే కంటిన్యూ అయ్యింది. మరి, ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం..
Brahmmamudi
Brahma mudi Serial:ఎప్పటిలాగానే కావ్య తన తప్పేమీ లేదు అని, రాజ్ తో చెప్పుకుంటూ ఉంటుంది. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి ఎవరు ఏ తప్పు చేసినా, కావ్య మీద వేసుకోవడం, తర్వాత ఆ తప్పు తాను చేయాలని నిరూపించుకోవడంలోనే సాగుతుంది. అయితే, స్వప్న కడుపు డ్రామా విషయంలో మాత్రం అందరూ కావ్యదే తప్పు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కావ్య, తాను తప్పు చేయలేదని, అబద్దం ఆడలేదని, కేవలం నిజం దాచాను అంటూ నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తోంది. తాతయ్య ఆరోగ్యం అలా ఉందని తనకు తెలీదని చెబుతుంది.
Brahmmamudi
కానీ, రాజ్ అంగీకరించడు. తాతయ్య అనారోగ్యం గురించి తెలిస్తే, ఇంకా ఎక్కువ డ్రామా చేసేదానివా అంటూ కావ్య పై సీరియస్ అవుతాడు. పాపం కావ్య చాలా ప్రయత్నిస్తుంది కానీ, రాజ్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో, కావ్య ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది.
Brahmmamudi
ఇక, సీన్ కట్ చేస్తే, ఉదయాన్నే ఇంట్లో అందరూ ధీనంగా కూర్చొని ఉంటారు. ఇంట్లో వాళ్లకు కాఫీ ఇవ్వడానికి కావ్య కాఫీ కలుపుతుంది. తీసుకు వచ్చి అందరికీ కాఫీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ, సీతారామయ్య అనారోగ్యం విషయం తెలిసి అందరూ బాధగా ఉంటారు. అందరూ బాధగా ఉంటే రుద్రాణి, స్వప్న మాత్రం ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు తాము ఒకటే అని నిరూపించుకున్నారు. ఇక, కావ్య అందరికీ కాఫీ ఇస్తుండగా, అందరూ కాఫీ తాగడానికి కూడా ఇష్టపడరు. అందరినీ అడిగినా, అందరూ వద్దని చెప్పేస్తారు. దీంతో, కాఫీ కప్పులు తీసుకొని కావ్య వెళ్లిపోతూ ఉంటుంది.
Brahmmamudi
అయితే, కావ్య వెళ్లిపోతూ ఉంటే, స్వప్న మాత్రం కావ్యను పిలిచి కాఫీ ఇవ్వమని అడుగుతుంది. కానీ, కావ్య ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది
Brahmmamudi
ఇక, ఆ తర్వాత చిట్టి, తన దగ్గర ఉన్న బంగారం, ఆస్తి కాగితాలు, డబ్బులు అన్నీ పట్టుకొని ఇంట్లో హాల్ లోకి వస్తుంది. ఆస్తి అంతా ఖర్చు చేసి అయినా, తన భర్త ప్రాణాలు కాపాడండి అంటూ వేడుకుంటుంది. తన చీర కొంగు పట్టుకొని, తన కుటుంబసభ్యులను ప్రాధేయపడుతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇంట్లోవారందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.
Brahmmamudi
అలాంటి సమయంలో రుద్రాణి వచ్చి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎలాగూ బతకని వ్యక్తికి ట్రీట్మెంట్ పేరుతో ఆస్తి మొత్తం ఖర్చు చేస్తారా అని ప్రశ్నిస్తుంది. నిజంగా, నాన్న బతికేవాడే అయితే, ఇప్పటికే పెద్ద అన్నయ్య, రాజ్ ఏదో ఒకటి చేసేవారు కదా అంటుంది. ఆ మాత్రం కోసం ఆస్తి మొత్తం కరిగిస్తారా అంటుంది. ఆ మాటకు చిట్టి కి కోపం నషాలానికి ఎక్కుతుంది. వెంటనే రుద్రాణి చెంప పగలకొడుతుంది. ఈ సీన్ చూసి రాహుల్ తప్ప, అందరూ సంతోషిస్తారు.
ఇక, బాధలో ఉన్న చిట్టిని రాజ్ సముదాయిస్తాడు. తాతయ్య ట్రీట్మెంట్ కోసం తాను చాలా మంది డాక్టర్లతో మాట్లాడానని చెబుతాడు. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్లకు తెలీదు కాబట్టి, సీక్రెట్ గా అన్ని పనులు చేశానని, ఇప్పుడు అందరికీ తెలిసేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతాడు. అమెరికాలో ఇలాంటి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేస్తారని, తాతయ్యకు ఏమీ కాదని, అన్నింటికీ తాను ఉన్నానంటూ వాళ్ల నానమ్మకి భరసా ఇస్తాడు.
Brahmmamudi
ఇక, వీళ్లంతా బాధలో ఉన్న విషయం పట్టించుకోకుండా అనామిక , కళ్యాణ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే, కళ్యాణ్ కట్ చేస్తూ ఉంటాడు. దీంతో, కళ్యాణ్ మాట్లాడటం లేదు అని అనామిక ఏకంగా అప్పు దగ్గరకు వెళ్తుంది. అక్కడ అప్పు ఏమో, కళ్యాణ్ కోసం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అనామిక ఎంట్రీ ఇచ్చి, కళ్యాణ్ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, నువ్వు చేయవా అప్పు అని అడుగుతుంది.
Brahmmamudi
అప్పు ఫోన్ చేయగానే, కళ్యాణ్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఇక, అక్కడ సీన్ కట్ చేస్తే, తనను చిట్టి కొట్టినందుకు రుద్రాణి రగిలిపోతుంది. ఈ క్రమంలోనే ఓ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఖాళీ ఆస్తి పత్రాలు తీసుకువెళ్లి, సీతారామయ్య దగ్గర గారాలు పోతుంది. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాన్న అంటూ మాటల్లో పెట్టి, ఆ పత్రాలపై సంతకం పెట్టించుకోవాలని అనుకుంటుంది.
మరీ, ఈ ఎపిసోడ్ లో అయితే, ఆయన సంతకం పెట్టలేదు. ఒకవేళ సంతకం పెడితే మాత్రం, ఆస్తి మొత్తం లాక్కొని అందరినీ వీధి మీదకు లాగడానికి రుద్రాణి ఏ మాత్రం సంకోచించదు. మరి ఫ్యూచర్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
Brahmmamudi
ఇక, కమింగ్ అప్ లో రాజ్ కి అన్నం తినిపించడానికి కావ్య ప్రయత్నిస్తుంది. కానీ, రాజ్ తినడానికి ఇష్టపడడు. దీంతో, తెలివిగా ఈ ట్రాక్ లోకి తన పొగరుబోతు అత్త అపర్ణని లాగుతుంది. కావ్య మీద పంతానికి అపర్ణ , రాజ్ కి అన్నం తినిపించే అవకాశం ఉంది. అదే కావ్య ప్లాన్ అయ్యి ఉండచ్చు. ఈ తంతు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం, బ్రహ్మ ముడి సీరియల్ కొనసాగుతోంది.