అర్జున్‌, సోనీచరిష్టాల స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన బోయపాటి..

First Published 14, Aug 2020, 3:14 PM

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, హాట్‌ భామ సోనీ చరిష్టా జోడిగా, రాధికా కుమారస్వామి, జేడి చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాథ్‌, బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ సోదరుడు పైసల్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం `ఇద్దరు`. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌. సమీర్‌ దర్శకత్వం వహించారు. ఎఫ్‌.ఎస్‌.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్‌ హీన్‌ ఫాతిమా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 

<p style="text-align: justify;">ఇందులో అర్జున్‌, సోనీ చరిష్టాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని తాజాగా మాస్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. రేపు(శనివారం) అర్జున్‌ పుట్టిన రోజుని&nbsp;పురస్కరించుకుని ఈ సాంగ్‌ని శుక్రవారం లాంచ్‌ చేశారు.&nbsp;</p>

ఇందులో అర్జున్‌, సోనీ చరిష్టాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని తాజాగా మాస్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. రేపు(శనివారం) అర్జున్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ సాంగ్‌ని శుక్రవారం లాంచ్‌ చేశారు. 

<p style="text-align: justify;">ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, `యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. సినిమాతో&nbsp;సోనీ చరిష్టాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.</p>

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, `యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. సినిమాతో సోనీ చరిష్టాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.

<p style="text-align: justify;">సోనీ చరిష్టా చెబుతూ, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ బర్త్ డే, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్‌ సాంగ్‌ని బోయపాటి శ్రీను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది.&nbsp;ఈ &nbsp;సందర్భంగా బోయపాటిగారికి, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిగారికి ధన్యవాదాలు. మా దర్శకుడు సమీర్‌ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. చూసిన ప్రతి ఒక్కరు&nbsp;కనెక్ట్ అవుతారు. అందరికి నచ్చే చిత్రమవుతుంది` అని తెలిపింది.&nbsp;</p>

సోనీ చరిష్టా చెబుతూ, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ బర్త్ డే, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్‌ సాంగ్‌ని బోయపాటి శ్రీను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ  సందర్భంగా బోయపాటిగారికి, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిగారికి ధన్యవాదాలు. మా దర్శకుడు సమీర్‌ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అందరికి నచ్చే చిత్రమవుతుంది` అని తెలిపింది. 

loader