- Home
- Entertainment
- Akhanda Sequel: లీడ్ కూడా వదిలా.. అఖండకి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన బోయపాటి, ఎన్టీఆర్ వదిలేసిన పాత్రలో..
Akhanda Sequel: లీడ్ కూడా వదిలా.. అఖండకి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన బోయపాటి, ఎన్టీఆర్ వదిలేసిన పాత్రలో..
కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాలయ్య అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది.

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాల విషయంలో భయపడుతున్న సమయంలో వారందరికీ ఒక ఆశను కల్పిస్తూ బాలయ్య అఖండ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప కూడా సక్సెస్ అయింది. చాలా రోజుల తర్వాత బాలయ్య తన పూర్తి స్టామినాతో బాక్సాఫీస్ వద్ద గర్జించిన చిత్రం ఇది.
అఖండ సంక్రాంతి సంబరాల పేరుతో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో బాలయ్య, దర్శకుడు బోయపాటి పాల్గొన్నారు. బాలయ్యని రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించడంలో బోయపాటి సక్సెస్ అయ్యారు. బాలయ్య అఘోర గెటప్ అయితే ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. మీడియా సమావేశంలో బాలకృష్ణ, బోయపాటి అనేక విషయాలు పంచుకున్నారు.
అఖండం చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించగా.. బోయపాటి సమాధానం ఇచ్చారు. సీక్వెల్ కి కావాల్సిన లీడ్ సినిమా చివర్లోనే వదిలాను. సీక్వెల్ గ్యారెంటీగా ఉంటుంది. ఎప్పుడు ఎలా అనేది తర్వాత చెబుతాను అని బోయపాటి అన్నారు. అఖండ సినిమా చివర్లో అఘోర పాత్రలో ఉన్న బాలయ్య చిన్న పాపతో..నువ్వు పిలిచినప్పుడు తప్పకుండా తిరిగి వస్తాను అని అంటాడు. బహుశా బోయపాటి చెప్పిన లీడ్ అదేనేమో.
తన తండ్రి ఎన్టీఆర్ వదిలేసిన శివుడి సబ్జెక్టుతో సినిమా చేయడంపై బాలయ్య స్పందించారు. శివుడి పాత్ర వేయడం వేరు.. అఖండ లాంటి సినిమాలో నటించడం వేరు అని బాలయ్య అన్నారు. అప్పట్లో మా కుటుంబంలో జరిగిన సంఘటన వల్ల నాన్నగారు శివుడి పాత్రలో నటించడం మానేశారు. అఖండ చిత్రంలో నేను శివుడి సైనికుడిగా అఘోర పాత్రలో నటించాను అని అన్నారు.
చాలా కాలం తర్వాత తన సినిమాకు థియేటర్లు దద్దరిల్లే రెస్పాన్స్ రావడంపై బాలయ్య మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వచ్చిన మంచి చిత్రం అఖండ. సో తప్పకుండా ఇలాంటి రెస్పాన్స్ రావడంలో ఆశ్చర్యం లేదు అని బాలయ్య అన్నారు.
బోయపాటి మాట్లాడుతూ.. సింహా, లెజెండ్ తర్వాత.. బాలయ్యతో అదే తరహా సినిమా చేస్తే కొత్తదనం ఉండదు. అందుకే ప్రకృతి, శివుడి నేపథ్యం ఎంచుకున్నట్లు బోయపాటి తెలిపారు. మొత్తంగా బోయపాటి అఖండ కి సీక్వెల్ ప్రకటించి నందమూరి ఫ్యాన్స్ కి మరింత జోష్ అందించారు.