- Home
- Entertainment
- జాక్ మూవీ ఎఫెక్ట్.. సిద్దు జొన్నలగడ్డకి దెబ్బేసిన బొమ్మరిల్లు భాస్కర్, ఊహించని విధంగా ట్రోలింగ్
జాక్ మూవీ ఎఫెక్ట్.. సిద్దు జొన్నలగడ్డకి దెబ్బేసిన బొమ్మరిల్లు భాస్కర్, ఊహించని విధంగా ట్రోలింగ్
సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో జంటగా నటించారు.

Siddhu Jonnalagadda
సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో జంటగా నటించారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల వరుస విజయాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన చిత్రం ఇది.
jack movie review
ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే తొలి షో నుంచే జాక్ చిత్రానికి డిజాస్టర్ టాక్ మొదలైంది. కానీ సిద్ద జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్ తో, క్రేజ్ తో మినిమం వసూళ్లు రాబడతాడని అంతా భావించారు. కానీ జాక్ చిత్రానికి వసూళ్లు దారుణంగా ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ చిత్రానికి 3 కోట్ల షేర్ కూడా రాలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Jack Movie
సిద్దు జొన్నలగడ్డ చిత్రానికి ఎలాంటి ఓపెనింగ్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా బొమ్మరిల్లు భాస్కర్ ఎఫెక్ట్ అని నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. బొమ్మరిల్లు, పరుగు చిత్రాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కి ఒక్క హిట్ కూడా లేదు. దీంతో నెటిజన్లకు బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలపై ఆసక్తి తగ్గిపోయింది. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం అయినప్పటికీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కావడంతో ఏమాత్రం బజ్ ఏర్పడలేదు.
Jack Movie
నెటిజన్లు అనుకున్న విధంగానే బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి షాక్ ఇచ్చాడు. దీంతో ప్రేక్షకులు సోషల్ మీడియాలో బొమ్మరిల్లు భాస్కర్ ని ట్రోల్ చేస్తున్నారు. అతడు వన్ టైం వండర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దు జొన్నలగడ్డ కి కూడా విమర్శలు తప్పడం లేదు. రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన చిత్రానికి ఇంత దారుణంగా వసూళ్లు రావడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ట్రేడ్ పండితులు చెబుతున్నది డీజే టిల్లు చిత్రం అనేది ఒక బ్రాండ్, ఆ క్రేజ్ ఆ చిత్రానికి మాత్రమే పరిమితం సిద్దు జొన్నలగడ్డకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టే క్రేజ్ లేదు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.