అబ్బాయిలను అంత మాట అనేసిందేమిటి, కృతీ సనన్ పెళ్లి చేసుకోదా..?
తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చేసింది బాలీవుడ్ సీన కృతీ సనన్. అంతే కాదు...పనిలో పనిగా అబ్బాయిలపై కామెంట్ల బాణాలు విసిరింది. ఆ కామెంట్లు విన్న వారు.. అదేంటి అలా అనేసింది అంటున్నారు.
బాలీవుడ్‌లో దూసుకుపోతోంది కృతీ సనన్. వరుస సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. అంతే కాదు ఇప్పుడున్న బాలీవుడ్ భామలలో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది కృతి సనన్.
రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ప్రభాస్ లాంటి హీరో పక్కన.. కృతీ అదిరిపోయేలా సెట్ అయ్యింది. బాలీవుడ్ సీతగాకృతీ ఫిక్స్ అయ్యింది.
మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసింది కృతీ. టాలీవుడ్ లోనే ఆమె సినిమా జీవితం స్టార్ట్ అయ్యింది. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన ఆమె.. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ చేరింది. అక్కడ మాత్రం బాగా క్లిక్ అయ్యింది బ్యూటీ. ఇక ప్రస్తుతం 33 ఏళ్లు వచ్చిన కృతీ సనన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందీ అని పలు సందర్భాల్లో ఆమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
మూడు పదులు వయస్సు దాటినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు కృతీ సనన్. అసలు ఆమె పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేదానిపై కూడా తాజగా క్లారిటీ ఇచ్చింది కృతీ. తనకు ఇంత వరకూ పెళ్లి కాకపోవడానికి కారణమేంటో రీసెంట్‌గా కృతి సనన్ రివీల్ చేసారు. అంతే కాదు అబ్బాయిలపై రకరకాల ఆరోపణలు కూడా చేసింది కృతీ సనన్.
కృతి సనన్ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొన్న కృతీ సనన్ కు ఎక్కువగా పెళ్లి విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు ఇంత వరకూ అసలు పెళ్లెందుకు చేసుకోవట్లేని మీడియా అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చారు కృతి సనన్. ఆమె పెళ్లికి.. చుట్టు ఉన్న అబ్బాయిలకు ముడిపెడుతూ.. కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆమె ఏమన్నారంటేు.. చుట్టూ ఉన్న అబ్బాయిలు మంచిగా లేరని.. మంచి అబ్బాయిలు ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉందని కృతీ సనన్ కామెంట్స్ చేసింది. ఇంత వరకూ తనకు పెళ్లి చేసుకోవడానికి మంచి అబ్బాయి దొరకలేదంట.అయితే గతేడాది ప్రభాస్-కృతి డేటింగ్‌లో ఉన్నారని.. పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదంతా పుకార్లని కృతీ సనన్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తాను ప్రేమిస్తే ముందు మీడియాకే చెపుతానంది.
అయినా సరే ఆదిపురుష్ సినిమా చేస్తున్న టైమ్‌లో ఈ వార్తలు గట్టిగా స్ప్రెడ్ అయ్యాయి. ప్రస్తుతం కెరీర్ మీద మాత్రమే తాను ఫోకస్ చేసినట్టు చెప్పుకొచ్చింది కృతీ. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉంది కృతి.