13ఏళ్ల కే అవి వాడడం మొదలుపెట్టాను.. అప్పట్లో నా చర్యలు వివాదాస్పదం అయ్యాయి!
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి మకాం మార్చిన ప్రియాంక చోప్రా... శరీర వర్ణం, అందం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే చిన్నతనం నుండి వర్ణం విషయంలో తనకు ఎదురైన అనుభవాలు తెలియజేశారు.
తమ కుటుంబంలో అందరూ తెల్లగా అందంగా ఉండేవారట. వాళ్ళతో పోల్చుకుంటే ప్రియాంక తక్కువ మేని ఛాయతో, ఛామన చాయగా ఉండేవారట. దానితో తమ ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా 'కాలి కాలి' అని ఆటపట్టించే వారట.
దీనితో తెల్లని వర్ణం కలిగి ఉండడమే నిజమైన అందం అనే భ్రమలో ప్రియాంక ఉండేవారట. ఇక 13ఏళ్ల ప్రాయం వచ్చే నాటికి తాను శరీరం తెల్లగా మారాలని ఫేస్ క్రీమ్ వాడడం మొదలుపెట్టారట.
ఇక గ్లామర్ రంగంలోకి వచ్చాక కూడా తన శరీర వర్ణం కారణంగా, అందంగా లేవని కొందరు అన్నారని ఆమె తెలియజేశారు.
స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె కొన్ని సౌందర్య ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉండగా... విమర్శలు ఎదుర్కొన్నారట.
తెల్లగా ఉండడమే అందం అనే భావాన్ని వ్యక్తపరిచే సౌందర్య ఉత్పత్తుల ప్రకటనల ద్వారా ఆమె జాతి విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని కొందరు విమర్శించారు అన్నారు.
హాలీవుడ్ లోకి వెళ్ళాక అలాంటి ప్రకటనలో నటించడం ప్రియాంక మానివేశారు. అయితే ఒక దశలో తెల్లని మేని ఛాయ కలిగి ఉండడమే అందం అని భావించినందుకు పశ్చాత్తాప పడుతున్నానని ప్రియాంక తెలియజేశారు.
ప్రస్తుతం వరుసగా హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. భర్త నిక్ జోనాస్ తో కలిసి ఆమె న్యూ యార్క్ లో కాపురం పెట్టారు. బాలీవుడ్ లో కూడా ఆమె చిత్రాలు చేస్తున్నారు.