Emraan Hashmi : పవన్ కళ్యాణ్ పై ఇమ్రాన్ హష్మి కామెంట్స్ వైరల్.. పవర్ స్టార్ ఎలాంటోడో చెప్పిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ ప్రస్తుతం కలిసి నటిస్తుండగా ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
బాలీవుడ్ రొమాంటిక్ స్టార్, ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మి త్వరలో తెలుగు ప్రేక్షకులను డైరెక్టర్ ఫిల్మ్ తో పలకరించబోతున్నారు. హిందీలో బాగా పాపులర్ అయినప్పటికీ సౌత్ లోనూ ఈయనకి మంచి క్రేజ్ ఉంది.
హారర్ర్ థ్రిల్లర్ చిత్రాలతో ఇమ్రాన్ హష్మి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే హీరోయిన్లతో చేసిన ముద్దు సీన్లు కూడా ఆయన్ని సంచనలంగా మార్చాయి. ప్రస్తుతం యాక్షన్ చిత్రాలతో అదరగొడుతున్నాడు ఇమ్రాన్ హష్మి..
ఇక తెలుగులోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ ఫిల్మ్ ‘ఓజీ’ (They Call Him OG)తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే.... రీసెంట్ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ హష్మిపవన్ కళ్యాణ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాను. ఆయన చాలా వాయిలెంట్. చాలా టఫ్ కూడానూ.. వాయిలెంట్ అయినప్పటికీ కూల్ గా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.
తొలిసారిగా సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను చూసినప్పుడు ఇమ్రాన్ కు కలిగి ఫీలింగ్ అదేనని చెప్పుకొచ్చారు. పవన్ నటనతో మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని కూడా చెప్పారు. ఇక ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు.
ఇక OG Movie 2024 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) పవన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే అందిన అప్డేట్స్ కు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నెక్ట్స్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.