మరోసారి తల్లి కాబోతున్న ఐశ్వర్యా రాయ్...? వారసుడొస్తున్నాడంటున్న అభిమానులు
మాజీ విశ్వసుందరి.. అందాల తార ఐశ్వర్యా రాయ్ మళ్ళీ తల్లి కాబోతోందా...? ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యిందా..? ఈ వార్తల్లో నిజమెంత..? వైరల్ అవుతున్న ఫోటోలలో ఏముంది..?
50 ఏళ్లకు రెండు అడుగులు దూరంలో ఉన్నా.. ఐశ్వర్య రాయ్ అందంలో ఏమాత్రం తేడా లేదు. ఇంకాస్త పెరుగుతుంది కాని.. తరగడంలేదు. ఐశ్యర్య వయసైపోతుందంటూ..గుర్తు చేసుకుంటే తప్ప ఆమె అందంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూనే ఉంది.
ఈ మధ్యే జరిగిన కాన్ ఫెస్టివల్ లో కూడా తళుక్కున మెరిసింది ఐశ్వర్య రాయ్. . 21 సంవత్సరాలుగా అనేక రకాల అంతర్జాతీయ వేదికపై ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటూనే ఉంది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐష్ గురించి ప్రత్యేకమైన చెర్చ జరుగుతుంది. ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ కొద్ది రోజులుగా బాలీవుడ్ లో న్యూస్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తలు గతంలో కూడా వచ్చాయి కాని ఈసారి మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
అంతే కాదు ఐష్ రెండోసారి తల్లికాబోతుందంటూ వస్తున్న వార్తలకు బలైమన సాక్ష్యాలు కూడా కనిపించడంవిశేషం. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఐశ్వర్య వీడియోలో కాస్త తేడాగా కనిపించింది. ముంబై విమానాశ్రయంలో భర్త అభిషేక్ బచ్చన్, కూతరు ఆరాధ్యలతో కలిసి ఐశ్వర్య కనిపించింది. ఈ వీడియోలో పొట్టను కవర్ చేసుకుంటు కనిపించింది.
ఈ వీడియోలో ఐష్ కాస్తా బొద్దుగా, పొట్ట భాగంగా ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపించడంతో.. ఇక ఐష్ ప్రగ్నెంట్ అంటూ ఫిక్స్ అయిపోయారు. ఈ విషయాన్ని వారు ప్రకటించకుండా దాచిపెట్టినట్టు ప్రచారం జరగుతోంది. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు.
ఐశ్యర్య రాయ్ , అభిషేక్ బచ్చన్ కు 2007 ఏప్రిల్ 20న పెళ్ళి కాగా.. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. అయితే బచ్చన్ ఫ్యామిలీ మాత్రం తమకు వారసుడు రావాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఆరాధ్యతో పాటు పాపకు తమ్ముడు వస్తున్నాడు అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐశ్వర్య రాయ్ కాని.. అభిషేక్ బచ్చన్ కాని స్పందించలేదు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బచ్చన్ ఫ్యామిలీ అనైన్స్ చేసే వరకూ ఆగాల్సిందే.