రాంచరణ్ కోసం దర్శకులని లైన్లో పెడుతున్న బడా బాలీవుడ్ నిర్మాత ఎవరు ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. భారీ బడ్జెట్ లో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. భారీ బడ్జెట్ లో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీ తర్వాత రాంచరణ్ తనకి రంగస్థలం లాంటి కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఖరారైంది. కాకపోతే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్ చేతిలో ఈ రెండు చిత్రాలు ఉన్నాయి. మరొక చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాలని రాంచరణ్ భావిస్తున్నాడు. సౌత్ దర్శకులతో కాకుండా బాలీవుడ్ దర్శకులతో సినిమా చేసేందుకు రాంచరణ్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటీవల కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్.. రాంచరణ్ తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. పురాణాలకు సంబంధించిన అద్భుతమైన కథ ఆయన వద్ద ఉందనేది టాక్. అయితే ఈ వార్తలని నిఖిల్ నగేష్ ఖండించారు. తాజాగా మరొక క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. రాంచరణ్ తో క్లోజ్ గా ఉండే బాలీవుడ్ నిర్మాత ఒకరు ఉన్నారు. ఆయన పేరు మధు మంతెన. గజిని, రక్త చరిత్ర, క్వీన్ లాంటి చిత్రాలని బాలీవుడ్ లో నిర్మించారు.
Madhu Mantena
రాంచరణ్ ముంబై వెళ్ళినప్పుడల్లా మధు మంతెన ఆతిథ్యం ఇస్తుంటారట. రాంచరణ్ తో మూవీ చేసేందుకు మధు మంతెన పలువురు బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏమీ ఫైనల్ కాలేదు. మంచి స్క్రిప్ట్ దొరికితే వెంటనే లాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.