- Home
- Entertainment
- మూవీ ఆఫర్ ఇచ్చి.. రాత్రికి రమ్మన్నారు, సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్ బ్యూటీ సంచలన ఆరోపణలు
మూవీ ఆఫర్ ఇచ్చి.. రాత్రికి రమ్మన్నారు, సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్ బ్యూటీ సంచలన ఆరోపణలు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ స్టార్స్ విషం చిమ్మడం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ లో అంతా పవిత్రంగా ఉన్నట్టు.. సౌత్ మేకర్స్ పై పడి ఏడుస్తున్నారు. కాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలతో సౌత్ పై కక్షతీర్చుకుంటున్నారు.

గతంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై చిన్న చూపు ఉండేది బాలీవుడ్ లో. మరీ ముఖ్యంగా టాలీవుడ్ అంటే అస్సలు లెక్కలోకి తీసుకునేవారు కాదు. సౌత్ సినిమా అంటే తమిళ సినిమా పోస్టర్లు వేసకుని..మద్రాస్ సినిమా అని పెట్టేసేవారు. కాని ఇప్పుడు బాలీవుడ్ ను పక్కన కూర్చోపెట్టి.. టాలీవుడ్ రాజ్యం ఏలుతోంది. మన మేకర్స్ హాలీవుడ్ స్టాయికి వెళ్లారు. ఇప్పట్లో ఏ ఇండస్ట్రీ టాలీవుడ్ ను అందుకునే పరిస్థితుల్లో లేదు.
దాంతో గతంలో దూరం పెట్టిన బాలీవుడ్ వాళ్లు.. ఇప్పుడు టాలీవుడ్ ను పట్టుకుని వేళ్లాడుతున్నారు. మన సినిమాను కూడా కలుపుకుని ఇండియన్ సినిమా అనే ట్యాగ్ తగిలించుకుంటున్నారు. ఇక కొంత మంది అయితే టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాపై విషం కక్కుతూనే ఉన్నారు. బాలీవుడ్ స్టాస్స్ ఏమైనా బుత్తిమంతులు, సుద్ద పూసలు అయినట్టు.. సౌత్ ఇండస్ట్రీపై... టాలీవుడ్‌పై రకరకాల విమర్షలు చేశారు. ఇక తాజాగా మరో హీరోయిన్ టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ లోనే ఎక్కువగా నెపోటిజమ్, కాస్టింగ్ కౌచ్ లాంటి ఆరోపణలు ఉన్నాయి. సుశాంత్ సింగ్ లాంటివారు ఎంత ఇబ్బందిపడ్డారోకూడా అందరికి తెలుసు. కంగనా రనౌత్ లాంటివారు దేనికోసం పోరాటం చేస్తున్నారో కూడా తెలుసు. అవన్నీ పక్కన పెట్టి సౌత్ పై బురద చల్లుతున్నారు కొంత మంది తారలు తాజాగా బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ అంకిత లోఖండే కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు చేశారు.
గతంలో తనకు సౌత్ లో ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో నేను ఓ ఆడిషన్‌కు వెళ్లాను. తర్వాత వాళ్లు నాకు ఫోన్ చేసి మీరు సెలెక్టయ్యరు, వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం చేసి వెళ్లండి అని చెప్పారు. నేను సంతోషంతో ఎగిరి గంతేశాను. విషయం అమ్మకు చెప్పడంతో ఆమె కూడా ఆనందపడ్డారు. అయితే ఇంత తేలికగా ఎలా సెలెక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది అన్నారు.
నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తి బయటే ఉండమన్నాడు. లోపలికి వెళ్లిన తర్వాత కాంప్రమైజ్ కావాలని అడిగారు. నేను షాకయ్యాను. నాకు అప్పుడు 19 ఏళ్లు. హీరోయిన్ చేస్తారని అనుకుంటే ఈ కాంప్రమైజ్ ఏమిటి అని అడిగాను. అందుకు వాళ్లు నిర్మాతతో ఓ రాత్రి గడపాలని చెప్పారు. అప్పుడు నేను గట్టిగా క్లాస్ తీసుకున్నాను.
నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తి బయటే ఉండమన్నాడు. లోపలికి వెళ్లిన తర్వాత కాంప్రమైజ్ కావాలని అడిగారు. నేను షాకయ్యాను. నాకు అప్పుడు 19 ఏళ్లు. హీరోయిన్ చేస్తారని అనుకుంటే ఈ కాంప్రమైజ్ ఏమిటి అని అడిగాను. అందుకు వాళ్లు నిర్మాతతో ఓ రాత్రి గడపాలని చెప్పారు. అప్పుడు నేను గట్టిగా క్లాస్ తీసుకున్నాను.
Ankita Lokhande
మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటాను. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని అంకిత లోఖండే ఆ నాటి అనుభవాన్ని అందరితో చెప్పుకున్నారు. అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెకు ఏ భాషలో ఈ అనుభవం ఎదురయ్యిందో మాత్రం చెప్పలేదు అంతకిత.