అవి చూడను కాబట్టే ప్రశాంతంగా ఉన్నాను, ఆలియా భట్ కామెంట్స్ వైరల్..
జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అంటోంది. .. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. అందులో ముఖ్యంగా సోషల్ మీడియా కామెంట్లను పట్టించుకోవద్దు అంటోంది బ్యూటీ.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ కూడా ఒకరు. కెరీర్ మంచి జోరు మీద ఉన్నప్పుడు.. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నుపెళ్లాడి.. ఓ పాపకు వెంటనే జన్మనిచ్చిన ఆలియా భట్.. సినిమాకు కాస్త విరామం తీసుకుని.. ప్రస్తుతం యాక్టీవ్ అవుతున్నారు. పెళ్ళి తరువాత కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా అదే ఫిట్ నెస్ ను మెయిటేన్ చేస్తుంది ఆలియా భట్.
ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. ఈసినిమాతో ఆస్కార్ వరకూ వెళ్లడంతో పాటు.. పాన్ ఇండియాహీరోయిన్ గా అవకాశాలు సాధిస్తోంది. ఇక ఈసినిమా తరువాత సౌత్ లో మరో సినిమా చేయలేదు బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపైనే దృష్టిపెట్టింది. ఇక తాజాగా ఆలియా భట్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య జాతీయ అవార్డ్ సాధించింది ఆలియా భట్. భర్త రణ్ బీర్ కపూర్ తోకలిసి అవార్డ్ వేడుకల్లో మెరిసిపోయింది బ్యూటీ. అయితే పెళ్లి చీరలో జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది అందాభామ అలియాభట్. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ చీర నాకు ప్రాణం. ఏదైనా పెద్ద ఈవెంట్ అయితే ముందు గుర్తొచ్చేది ఆ చీరే. నాకు నగలపై కూడా ఇంట్రెస్టుండదు. ఆ చీర అంటే మాత్రం ఎందుకో పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది .
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు.. ఎక్కువగా ప్యాషన్ డ్రెస్ లు.. అది కూడా హాట్ షో చేస్తూ కనిపిస్తారు. అకేషన్లలో వారి డ్రస్సింగ్ స్టైల్ చూస్తే మతి పోవాల్సిందే. కాని ఆలియా భట్ మాత్రం వాటికి డిఫెంట్ గా ఉంటుంది. ఆమె ఈ విషయంలో మాట్లాడుతూ.. సాధారణంగా నాలాంటి ఆడవాళ్లు ఇలాంటి వేడుకల్లో కొత్తకొత్త డ్రస్సులో కనిపించాలనుకుంటారు. నేను మాత్రం ఆ చీరలోనే కనిపించాలనుకుంటా. నాకు అదో తృప్తి అని అంటోంది అలియా భట్.
ఇక ట్రోలింగ్స్ గురించి సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడింది బ్యూటీ. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. సెలబ్రిటీలపై ఇలాంటివి కామన్.. మనం ప్రశాంతంగా ఉండాలన్నా.. ఫ్యామిలీ కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ముఖ్యంగా మనం సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి. అక్కడి కామెంట్స్ చదివినా, చూసినా మనశ్శాంతి ఉండదు అన్నారు
రకరకాల ఆలోచణలు, అపోహలు, అపార్థాలు ఇలా జీవితం నాశనం కావడానికి అవి కారణం అవుతాయి. అందుకే నేను వాటిని పట్టించుకోను. అదృష్టం కొద్ది.. ఈ విషయంలో నన్ను అర్ధం చేసుకునే భర్త నాకులభించాడు. అని ఎంతో సంతోషంగా వెల్లడించింది ఆలియా భట్. పనిలో పనిగా రణ్ బీర్ కపూర్ కు కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది బ్యూటీ.