- Home
- Entertainment
- గులాబీ రంగు చీరలో కత్రినా కైఫ్ కొంటె పోజులు.. అన్ని యాంగిల్లో అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
గులాబీ రంగు చీరలో కత్రినా కైఫ్ కొంటె పోజులు.. అన్ని యాంగిల్లో అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ (Katrina Kaif) చీరకట్టులో అభిమానులను మైమరిపిస్తోంది. గులాబీ రంగు చీరలో దర్శనమిచ్చిన గ్లామర్ బ్యూటీ కొంటె పోజులతో మతిపోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.

స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్లలో కత్రినా పేరు మొదటి వరుసలో ఉంటుంది. బాలీవుడ్ లో పాతుకుపోయిన ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగానే పరిచయం.
తెలుగులో నందమూరి నటిసింహం బాలయ్య, విక్టరీ వెంటకేశ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో నటించింది కేవలం రెండు చిత్రాల్లోనే అయినా స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో మాత్రం వరుస చిత్రాల్తో మోత మోగించింది.
ఇప్పటికీ వరుస చిత్రాలతో తన అభిమానులను, ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. తాజాగా కత్రినా నటించిన చిత్రం ‘ఫోన్ బూత్’ (Phone Bhoot) రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు కత్రినా కైఫ్ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. చీరకట్టులో కత్రినాను చూసిన నెటిజన్లు చూపుతిప్పుకోవడం భారంగా భావిస్తున్నారు.
అప్పటికే హాట్ నెస్ తో అల్లాలాడించే కత్రినా కైఫ్ చీరకట్టులో అందాలను ప్రదర్శించంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ బ్యూటీ కొంటె పోజులకు ఫిదా అవుతున్నారు. కత్రినా మత్తు చూపులకు మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో బ్యూటీ పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal)ను కత్రినా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కుటుంబ సభ్యులతో సరదా గడుపుతోంది. మరోవైపు కేరీర్ పట్ల కూడా శ్రద్ద వహిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘టైగర్ 3’, అలాగే ‘మేరీ క్రిస్టమస్’ చిత్రాల్లో నటిస్తోంది.