MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెండీ వేర్ లో బాలీవుడ్ బ్యూటీ సూపర్ స్టైలిష్ పోజులు.. యూఎస్ లోని లూయిస్ విట్టన్ హౌస్ అంబాసిడర్ గా దీపికా..

ట్రెండీ వేర్ లో బాలీవుడ్ బ్యూటీ సూపర్ స్టైలిష్ పోజులు.. యూఎస్ లోని లూయిస్ విట్టన్ హౌస్ అంబాసిడర్ గా దీపికా..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే (Deepika Padukone) ఫ్యాషన్ సెన్స్ అట్రాక్టివ్ గా ఉంది. యూఎస్ లోని లూయిస్ విట్టన్ హౌస్ అంబాసిడర్ గా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే అక్కడి క్రూయిజ్ షోకు హాజరైందీ బ్యూటీ. ఈ సందర్భంగా పలు ఫొటోలకు స్టైలిష్ గా పోజులిచ్చింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 13 2022, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తన స్థాయిని పెంచుకుంటోంది. ఏకంగా ఇటీవల గ్లోబల్ ఈవెంట్ కేన్స్ లో ఫిల్మ్ ఫెస్టివల్ జూరీ మెంబర్ గా ప్రకటించబడింది. తాజాగా కాలిఫోర్నియాలోని లూయిస్ విట్టన్ హౌస్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె తొలిసారి కనిపించింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీపికా పదుకొణె లూయిస్ విట్టన్ హౌస్ అంబాసిడర్‌గా ప్రకటించిన కొద్ది రోజులకే, USలో తొలిసారి అధికారికంగా కనిపించింది. మే 12న, కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో లూయిస్ విట్టన్ -2023 క్రూయిజ్ షోను నిర్వహించారు. ఈ షోకు హాజరైన దీపిక రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ ఆకట్టుకుంది.
 

36

ఈ సందర్భంగా దీపికా ఫొటోలకు స్టైలిష్ గా పోజులిచ్చింది.  ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో దీపికా  పెద్ద జాకెట్‌ ధరించింది. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, టాప్ లో, మోకాలి వరకు బ్రౌన్ బూట్‌లను వేసుకుంది. ఈ ట్రెండీ వేర్ లో దీపికా సూపర్ స్టైలిష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

46

ఈ పిక్స్ పంచుకుంటూ ఒక చిన్న నోట్ రాసింది.  ‘నా మొదటి క్రూయిజ్ షో.. ఇది మరింత పరిపూర్ణంగా ఉంటుందని భావిస్తున్నాను. దిగ్గజ సాల్క్ ఇన్‌స్టిట్యూట్ మరియు నికోలాస్ఘే స్క్వియర్ సృజనాత్మకత అద్భుతం. ఎంతో ప్రేమగా, దాతృత్వంతో నన్ను ఈ  కుటుంబంలోకి స్వాగతించినందుకు louisvuittonకి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నా హృదయం ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయింది.’ అని పేర్కొంది. 
 

56

ఈ కార్యక్రమం అనంతరం దీపికా కేన్స్ మెంబర్ జ్యూరీగా కూడా ప్రకటించబడిన సందర్భంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లోని కేన్స్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.ఈ గ్లోబల్ ఈవెంట్ మే 16న ప్రారంభమై మే 28న ముగుస్తుంది. అయితే ఈవెంట్ లో దీపికా పదిరోజుల పాటు పాల్గొనాలని భావిస్తుందట. 
 

66

దీపికా పదుకొనె తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌(Prabhas)తో కలిసి ఆమె `ప్రాజెక్ట్ కే` (Project K)చిత్రంలో నటిస్తుంది. అలాగే రోహిత్ శెట్టి సర్కస్, షారుఖ్ ఖాన్ సరసన పటాన్, మరో హిందీ చిత్రం ఫైటర్ చిత్రాల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved