- Home
- Entertainment
- బీచ్ లో విరాట్ కోహ్లీ సతీమణి అందాల విందు... ఆరెంజ్ బికినీలో గ్లామర్ బాంబ్ పేల్చిన అనుష్క శర్మ!
బీచ్ లో విరాట్ కోహ్లీ సతీమణి అందాల విందు... ఆరెంజ్ బికినీలో గ్లామర్ బాంబ్ పేల్చిన అనుష్క శర్మ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) బీచ్ లో హాట్ బాంబ్ పేల్చింది. వీకెండ్ ట్రీట్ తో అదరగొట్టింది. ఆరెంజ్ బికినీలో స్కిన్ షోతో పిచ్చెక్కిస్తోంది. తానే స్వయంగా పిక్స్ ను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దూసుకుపోతోంది. పాపులర్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లిని 2017లో వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ఇంకా సినిమాల్లోనే కంటిన్యూ అవుతోంది. సినిమాల పరంగా ఏమాత్రం జోరు తగ్గించడం లేదు.
ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ చిత్రాలకుక ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం చిత్రీకరించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. చిత్రాల్లో నటించడమే కాకుండా.. ఇటు నిర్మాతగాను వ్యవహరించింది అనుష్క శర్మ.
క్లీన్ స్లేట్ ఫిలింజ్ ప్రొడక్షన్ కంపెనీని అక్టోబర్ 2013లో అనుష్క శర్మ మరియు ఆమె సోదరుడు కర్నేష్ శర్మ ఇద్దరు కలిసి స్థాపించారు. ముంబై కేంద్రంగా ఈ సంస్థ కొనసాగుతోంది. ఈ బ్యానర్ ద్వారా ‘ఎన్ హెచ్ 10’ , ‘పాటల్ లోక్’, ‘బుల్బుల్’ వంటి ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లను నిర్మించారు.
అయితే తనకు సినిమా నిర్మాణంతో ఆసక్తి ఉన్నా.. నటన పరంగా మరింత సమయం కేటాయించేందుకు ఇటీవలనే క్లీన్ స్టేట్ ఫిలింజ్ బ్యానర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తన సోదరుడే పూర్తి బాధ్యతలు చూస్తున్నారు. ఇక అప్పటి నుంచి అనుష్క పూర్తిగా చిత్రాల్లో నటించేందుకే సమయం కేటాయిస్తోంది.
ఇటు వరస చిత్రాలతో ప్రేక్షకులను, తన అభిమానులను అలరిస్తున్న అనుష్క శర్మ.. ఇటు సోషల్ మీడియాలోనూ మరింత దగ్గరగా ఉంటోంది. ఈ సందర్భంగా సమయం దొరికినప్పుడల్లా పలు గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఖుషీ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ లో అనుష్క శర్మ ఆరెంజ్ బికినీలో కనిపించి మైండ్ బ్లాక్ చేసింది. సముద్రపు ఒడ్డున బీచ్ లో అందాల విందు చేస్తూ రచ్చరచ్చ చేసింది. అనుష్క గ్లామర్ షోకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. అయితే ఈ పిక్స్ ను షేర్ చేస్తూ ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘మీ సొంత ఫొటోలను తీయడం వల్ల వచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని పేర్కొంది.