MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్, పడిపోయాడన్నారు.. తిరిగొచ్చి బాలీవుడ్ నే నిలబెట్టిన బాద్ షా..

షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్, పడిపోయాడన్నారు.. తిరిగొచ్చి బాలీవుడ్ నే నిలబెట్టిన బాద్ షా..

ఇండియాన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ఓ ప్రత్యేక పేజ్ ను.. ఇమేజ్ ను సాధించిన నటుడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ కే బాద్ షాగా వెలుగు వెలిగిన ఈ స్టార్ సీనియార్ హీరో 58 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ఒక టైమ్ లో షారుఖ్ పని అయిపోయింది అని ఎగతాళి చేయగా.. పడిపోయిన బాలీవుడ్ నే తన సినిమాలతో పైకి లేపి.. బాలీవుడ్ కు తానేనిజమైన బాద్ షా అనిపించుకున్నాడు. 

Mahesh Jujjuri | Published : Nov 02 2023, 09:05 AM
5 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Asianet Image

ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు.. కాని ఇండస్ట్రీని ఏలే హీరోలు మాత్రం కొందరే ఉంటారు. వారు స్టార్ డమ్ ను సాధించడమే కాదు.. ఇండస్ట్రీని కాపాడుకుంటారు కూడా. అలాంటి హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఏటిలోకి పాత నీరు వెళ్ళి కొత్త నీరు వచ్చినట్టు.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలు తరాలు మారుతుంటే.. కొత్త వారు ఆ బాధ్యతలు తీసుకుంటారు. అది కూడా అభిమానులు అందించిన స్టార్ డమ్ తోనే.. అలాంటి స్థానం బాద్ షాకు దక్కింది. 
 

212
Asianet Image

బాలీవుడ్ లో అమితాబ్ హవా నడుస్తున్న టైమ్ లో.. బిగ్ బీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఎంతోమంది హీరోలు లైన్ లోకి వచ్చారు. సినిమాలు చేశారు. అంతో ఇంతో స్టార్ డమ్ సంపాదించారు.. కాని బాలీవుడ్ ను ఏలేంత స్టార్ డమ్ మాత్రం కొంత మందికే వచ్చింది.  వాళ్ళల్లో బాలీవుడ్ ని ఏలింది మాత్రం షారుఖ్ ఒక్కడే. తన సినిమాల సక్సెస్ రికార్డులతో బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు షారుఖ్.
 

312
Asianet Image

వరుస సక్సెస్ లతో దూసుకెల్తూ..  బాలీవుడ్ ను ఏలుతున్న షారుఖ్ కెరీర్ కు వరుస ఫెయిల్యూర్స్ తో బ్రేక్ పడింది. 2016 లో ఆయన చేసిన ప్రయోగం గట్టిగా దెబ్బ కొట్టింది. ఆయన నటించిన ఫ్యాన్ సినిమా  షారుఖ్ స్పీడ్ కి అడ్డుకట్ట వేసింది. అక్కడ్నుంచి రేస్, జబ హ్యారీ మెట్ సీజల్, జీరో.. వరుసగా ఒకదానిమించి ఒకటి డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్ళిపోయారు.. బాలీవుడ్ లో ఆయన పని అయిపోయింది. ఇక సినిమాలు చేయడు అన్నారు. ఎందుకంటే బాలీవుడ్ అప్పుడుమంచి ఊపు మీద ఉంది. షారుఖ్ తప్పించి అందరు హీరోలు హిట్లు కొట్టారు 
 

412
Asianet Image

ఇక ఆతువాత షారుఖ్ కొన్నాళ్లు చాలా కష్టాలు అనుభవించారు. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కాని.. సినిమాలు పోవడం.. ఇలా ఓ నాలుగేళ్ళు.. ఆయన ఇంటికే పరిమితం అయ్యాడు.. షారుఖ్ నిజంగానే సినిమాలు మానేశారా అనే అనుమానం స్టార్ట్ అయింది. ఇక ఇదే టైమ్ లో బాలీవుడ్ రేంజ్ పడిపోవడం స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ అమాంతం పైకి లేచింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనేంతగా ఎదిగింది. దాంతో బాలీవుడ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సరిగ్గా అదే టైమ్ లో ఎంటర్ అయ్యాడు షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ ను ఆదుకోడానికి దేవుడిలా వచ్చాడు. 
 

512
Asianet Image

వరుస ప్లాప్ లతో.. టాలీవుడ్ ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిన బాలీవుడ్ కు.. రెండే రెండు సినిమాలతో.. రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్స్ తో సెన్సేషన క్రీయేట్ చేసి..బాలీవుడ్ కు నిజమైన బాద్ షా తానే అనిపించుకున్నాడు. నాలుగేళ్ళ తరువాత పక్కా ప్లాన్ తో షారుఖ్ ఖాన్ చేసిన రెండు సినిమాలలు.. పఠాన్, జావాన్ లు చెరో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి.. షారుఖ్ పరువు నిలబెట్టడంతోపాటు బాలీవుడ్  ఊపిరి తీసుకునేలాచేశాయి. అదే టైమ్ లో షారుఖ్ సినిమాలవి ఫేక్ కలెక్షన్స్ అంటూ విమర్షలు కూడా వచ్చాయి. 

612
Asianet Image

షారుఖ్ ఖాన్ కు ఈ స్టార్ డమ్ వారసత్వంగా రాలేదు. పుట్టుకతోనే ఆయన గోల్డెన్ స్పూన్ కాదు. ముంబయ్ లోనే అత్యంత విలాసవంతమైన భవంతి మన్నత్ లో నివసిస్తున్నాడు షారుఖ్.. ఆయన ఇంటి నేమ్ బోర్డ్ కోసమే 30 లక్షల వరకూ పెట్టాడు.. కాని ఆయన పుట్టుకతోనే ధనవంతుడు కాదు.. హీరోగా నిలబడటం కోసం సినిమా కష్టాలెన్నో పడ్డాడు షారుఖ్ ఖాన్. పుట్టింది ఢిల్లీలో అయినా.. సినిమాల కోసం ముంబయ్ చేరాడు.. చేతిలో డబ్బులు లేక రోడ్లమీద తిరిగాడు.. ఎన్నోరోజులు నీళ్ళు తాగి కడుపు నింపకున్నాడు. 

712
Asianet Image

ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. ముంబైలో ఉండటానికి రూమ్ కూడా లేక, డబ్బులు లేక బీచ్ పక్కన చాలా రోజులు పడుకున్నాడు.. ఆల్బమ్ పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగాడు.. తాను అనుభవించిన కష్టాలను కళ్లకు కట్టినట్టు  ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ వెల్లడించాడు. బాలీవుడ్ ను ఏలే స్తాయికి వచ్చిన షారుఖ్ ఖాన్ కెరీర్ స్టార్ట్ అయ్యింది మాత్రం  టెలివిజన్ లోనే.. పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసి సినిమాలో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఓ నాలుగేళ్లు నెట్టికొచ్చిన షారుఖ్.. ఆతరువాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. 

812
Asianet Image

ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. ముంబైలో ఉండటానికి రూమ్ కూడా లేక, డబ్బులు లేక బీచ్ పక్కన చాలా రోజులు పడుకున్నాడు.. ఆల్బమ్ పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగాడు.. తాను అనుభవించిన కష్టాలను కళ్లకు కట్టినట్టు  ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ వెల్లడించాడు. బాలీవుడ్ ను ఏలే స్తాయికి వచ్చిన షారుఖ్ ఖాన్ కెరీర్ స్టార్ట్ అయ్యింది మాత్రం  టెలివిజన్ లోనే.. పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసి సినిమాలో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఓ నాలుగేళ్లు నెట్టికొచ్చిన షారుఖ్.. ఆతరువాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు.

912
Asianet Image

1992లో వచ్చిన దీవానా సినిమాలో ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేసి వెండితెరపై కనిపించి షారుఖ్.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , సెకండ్ హీరోగాకొన్నిసినిమాలు చేశాడు. 1993 లో వచ్చిన బాజీగర్, డర్ సినిమాల్లో విలన్ గా చేసిన షారుఖ్.. ఈ సినిమాతో తనలో నటను అందరికి తెలిసేలా చేశాడు. కాని ఈసినిమాతో ఆయనకు అన్నీ విలన్ పాత్రలే వచ్చాయి. హీరో అవ్వాలి అన్నది తన టార్గెట్ కాగా.. విలన్ రోల్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు షాకుఖ్ ఖాన్.  కాని షారుక్ కు మళ్లీ సెకండ్ హీరో పాత్రలే వచ్చాయి కాని.. మెయిన్ హీరోగా మాత్రం అవకాశాలు రాలేదు.. 

1012
Asianet Image

సరిగ్గా  1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమా షారుఖ్ జీవితాన్ని మార్చేసింది. ఈ ఒక్క సినిమాతో కోట్లమంది అభిమానులను ఒకేసారి సంపాదించాడు షారుఖ్. ఈసినిమాతో అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చిపోయారు..ఒక్క బాలీవుడ్ లోనే కాదు.. దేశ మంతా ఆయన పేరు మారు మోగిపోయింది.  ఇప్పటికి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది ఆ సినిమా, సాంగ్స్. దీంతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు షారుఖ్.

1112
पहले #asksrk सेशन सन्डे को होता था

पहले #asksrk सेशन सन्डे को होता था

అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తూ అభిమానులను పెంచుకున్నాడు, బాలీవుడ్ కి బాద్ షా అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత పర్దేశ్, దిల్ తో పాగల్ హై, డూప్లికేట్, దిల్ సే, కుచ్ కుచ్ హోతా హై, కభికుషి కభీ గమ్.. లాంటి అనేక సినిమాలతో లవర్ బాయ్ అనిపించుకుని ఎంతోమంది అమ్మాయిలకు ఫేవరేట్ హీరో అయ్యాడు. వరుసగా ప్రేమ సినిమాలతో సక్సెస్ కొట్టిన షారుఖ్ అప్పట్లో అమ్మాయిలంతా చేసుకుంటే షారుఖ్ లాంటివాడినే చేసుకోవాలి అనేంతలా జనాల్లోకి వెళ్ళిపోయాడు తన సినిమాలతో.

1212
Asianet Image

దేవదాస్ , డాన్ , చక్ దే ఇండియా ,ఓం శాంతి ఓం, రబ్ నే బనాది జోడి, డాన్ 2, జబ తక్ హై జాన్.. ఇలా 20వ దశాబ్దంలో కూడా వరుస హిట్స్ కొడుతూ బాలీవుడ్ ని పూర్తిగా ఏలేసాడు. 2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో సౌత్ మొత్తం షారుఖ్ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ సినిమా సౌత్ లో కూడా భారీ విజయం సాధించింది. సౌత్ లో కూడా షారుఖ్ కి ఫ్యాన్స్ క్లబ్స్ పెట్టేలా చేసింది. ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్, మరో పక్క అవార్డులు.. ఇలా డబ్బులు, ఫేమ్ తో చూడాల్సిన సక్సెస్ అంతా చూసేసాడు షారుఖ్ ఖాన్. ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించిన షారుఖ్ ఖాన్.. ఇంత వయస్సు వచ్చినా.. ఆ అభిమానం చెక్కు చెదరకుండా చూసుకుంటున్నాడు. సో హ్యాపీ బర్త్ డే బాలీవుడ్ రియల్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories