MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ లో ప్రియాంక, దీపికా..ఆలియా టాలీవుడ్ లో అనుష్క, త్రిష, తమన్నా..పెళ్ళి గురించి ఏమంటున్నారంటే..?

బాలీవుడ్ లో ప్రియాంక, దీపికా..ఆలియా టాలీవుడ్ లో అనుష్క, త్రిష, తమన్నా..పెళ్ళి గురించి ఏమంటున్నారంటే..?

పెళ్లి విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు వేరు వేరుగా ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో వరుస పెళ్ళిళ్లు జరుుతుంటే.. టాలీవుడ్ భామలు మాత్రం ఇంకా టైమ్ ఉంది అంటున్నారు. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 08 2022, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బాలీవుడ్ హీరోయిన్లు ఎంచక్కా అటు కెరీర్ ని, ఇటు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందైతే  పెళ్లెప్పుడు చేస్కుందామా అని వెయిట్ చేస్తున్నారు. కాజల్ లాంటి హీరోయిన్లైతే చేతిలో సినమాలు వదులుకుని మరీ పెళ్లి చేసుకుని పెద్దగా లేట్ కూడా చెయ్యకుండా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మన హీరోయిన్లు మాత్రం అబ్బే..అప్పుడే పెళ్లేంటని కొట్టిపారేస్తున్నారు.

210

బాలీవుడ్ లో వరసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటుంటే సౌత్ హీరోయిన్లు పెళ్లి ఊసే ఎత్తడం లేదు .బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ..కెరీర్ లోపీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకన్నా కానీ ..కెరీర్ ని ఏమాత్రం పక్కకి పెట్ట లేదు వరసగా అదే స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. ఇటు కత్రీనా కైఫ్ కూడా కరెక్ట్ టైమ్ లో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసేసుకుంది. రీసెంట్ గా ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేసిన కత్రీనా..  కెరీర్ ను మాత్రం ఆపేయను అని చెప్పేసింది. 

310

ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదుగుతున్నప్పుడే ప్రియాంకా చోప్రా కూడా పెళ్లి చేసుకుంది కానీ .. ఇంకా యాక్టర్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. అనుష్క శెట్టి, సోనమ్ కపూర్, విద్యాబాలన్..ఇలా హీరోయిన్లందరూ హీరోయిన్లుగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్లయ్యి కూడా కెరీర్ కంటిన్య చేస్తున్నారు. కానీ మన వాళ్లు మాత్రం పెళ్లి వైపు కూడా చూడడం లేదు .

410

చేసింది తక్కువ సినిమాలైనా ..ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ చేసిన యామీ గౌతమ్ , మౌని రాయ్ లాంటి హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా టాప్ హీరోయిన్ గా వరసగా సినిమాలతో బిజీగా ఉన్న  ఆలియా భట్ కూడా రణబీర్ తో పెళ్లి పీటలెక్కడానికి టైమ్ కోసం వెయిట్ చేస్తోంది. అంతేకాదు .. రణబీర్ కి నాకు మనసులోఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ క్రేజీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.

510

అసలు పెళ్లి ఊసేఎత్తని 40 ఏళ్ల స్టార్ హీరోయిన్ అనుష్క. సౌత్ లో అనుష్క అన్ డౌటెడ్ లీస్టార్ హీరోయిన్ . అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్, ఇమేజ్ సంపాదించుకుంది స్వీటీ. కెరీర్ కిమధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన అనుష్క..పెళ్లి అంటే మాత్రం మాటదాటేస్తోంది. ఎప్పుడు రాసి పెట్టిఉంటే అప్పుడే జరుగుతుంది..వాటి గురించి ఆలోచించడంఎందుకంటోంది.

610

సౌత్ మొత్తం చుట్టేస్తున్న త్రిష కూడా అంతే. ఈ సంవత్సరం.. నెక్ట్స్ ఇయర్  పెళ్లి చేసుకుంటానని చెబుతూనే వస్తోంది. ఇక ఎన్నాళ్లని ఈ సోలో లైఫ్..  నేను కూడా మ్యారీడ్ లైఫ్ టేస్ట్ చూస్తానని చాలా కాలం నుంచి చెబుతోంది. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్న త్రిష.. ఈ సారి ఆ తప్పు చెయ్యనంటోంది. నన్ను నన్ను ఇష్టపడే వాడు దొరకినప్పుడు అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా చేసేసుకుంటానన్న38ఏళ్ల   త్రిష  ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు .

710

32 ఏళ్ల మిల్కీ బ్యూటీ తమన్నా ... కూడా సారీ బాస్ ఇప్పుడు నేనుపెళ్లిచేస్కునే మూడ్ లో లేను. వరసగా సినిమాలు , సిరీస్ లు , షోలు ..ఇలా బ్యాక్ టూ బ్యాక్ వర్క్ తో బిజీగా ఉన్నప్పుడు పెళ్ళి గురించి ఎలా  ఆలోచిస్తానంటోంది. ప్రజెంట్ ,ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, చిరంజీవి , నాగార్జున ఇలా చాలా సినిమాలు చేస్తోంది తమన్నా.

810

సౌత్ లో స్టార హీరోయిన్ గా చక్రం తిప్పుతూ.. నార్త్ లో కూడా ఇప్పుడిప్పుడే బాగా బిజీ అవుతున్న పూజాహెగ్డే అయితే .. నాకా...పెళ్లా.. అసలు దాని గురించి ఆలోచనే లేదంటోంది. చేతిలో 4,5 ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగాఉన్న పూజా.. ప్రజెంట్ చేస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. అందుకు అసలుపెళ్లి ఊసే నా దగ్గర తీస్కురావద్దంటోంది. పెళ్లికి ఇంకా చాలా టైముంది.. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కాదు కదా..ఆలోచేం టైమ్ కూడా లేదంటోంది ఈ 31 ఏళ్ల ముద్దుగుమ్మ.

910

సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ కి మోస్ట్ వాంటెడ్ క్యూట్ హీరోయిన్ గా మారిపోయింది మళయాళ భామ సాయిపల్లవి. కెరీర్ బానే ఉంది..మరి పెళ్లి సంగతేంటి..? ప్రేమ పెళ్లా..? పెద్దలు కుదిర్చిన పెళ్లా అని  అభిమానులు అడిగితే .. అబ్బే ..అసలు ఆ ఉద్దేశ్యమే లేదంటోంది.   ఫిదా సినిమాలో తన తండ్రిని వదిలి వెళ్లను..అసలు పెళ్లి చేసుకోను అన్న సాయిపల్లవి రియల్ లైఫ్ లో కూడా ఇలానే అంటోంది ఈ యాక్టర్ కమ్ డాక్టరమ్మ.

1010

నేషనల్ క్రష్ రష్మిక అయితే ... నేనింకా చిన్నపిల్లని ..నాతో పెళ్లి లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదంటోంది. పాతికేళ్ల ఈముద్దుగుమ్మ..ఇప్పుడు సౌత్ లోనే బిజీ యెస్ట్ హీరోయిన్ . సౌత్ స్టార్ హీరోలతో పాటు ..బాలీవుడ్ హీరోల్ని కూడా లైన్లో పెట్టేసిన రష్మిక మందాన ..పెళ్లి అనే మాట అనడానికి కూడా టైమ్ లేదంటోంది. పుష్ప హిట్ తో మరిన్ని సినిమా ఛాన్సులతో బిజీ అయిన రష్మక పెళ్లికేం తొందరంటోంది. ఒక వైపు నార్త్ హీరోయిన్లు కెరీర్ పీక్స్ లోనే వాళ్లు పెళ్లి చేసుకుని  కెరీర్ కంటిన్యూ చేస్తుంటే ..సౌత్ హీరోయిన్లు మాత్రం..పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుతిరుగుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Recommended image2
Dhurandhar 2 Collections: `పుష్ప 2` కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved