ఇంత సింపుల్ గా ఉన్న ప్రియాంక చోప్రా స్నేక్ నెక్లెస్ అంత కాస్టా..?
సెలబ్రిటీస్ ఏం చేసినా.. ఎటువంటి వస్తువులు వాడినా.. అది హాట్ టాపిక్ అవుతుంది ఈరోజుల్లో. మరీముఖ్యంగా స్టార్స్ కాస్ల్టీగా ఏమైనా వేసుకుంటే.. నెట్టింట రచ్చ స్టార్ట్ అయినట్టే.. తాజాగా ప్రియాంక చోప్రా స్నేక్ నెక్లస్ అలాగే వైరల్ అవుతోంది.

టాలీవుడ్, బాలీవుడ్ , హాలీవుడ్.. ఇలా అంచలంచలుగా ఎదిగిన తార ప్రియాంక చోప్రా. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగింది ప్రియాంక చోప్రా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇండియన్ ఫ్రిల్మ్స్ తో పాటు హాలీవుడ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా వదిలేసి ఎక్కువగా హాలీవుడ్ లోనే నటిస్తోంది. ఇక హాలీవుడ్ లో కూడా ప్రియాంక చోప్రాకు వరుస అవకాశాలు రావడంతో పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.
తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్ యాక్టర్ కమ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకి కూడా సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చింది. అయితే ఈ జంట ఏజ్ లో డిఫరెన్స్ ఎంత ఉన్నా కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు.ప్రస్తుతం వరుసగా ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తోంది ప్రియాంక. హాలీవుడ్ లో సందడి చేస్తోంది. నిక్ తో కలిసి అక్కడి ఈవెంట్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంటోంది.
వందల కోట్లతో ఇల్లు కొన్న ప్రియాంక.. లాస్ ఎంజల్ నుంచి అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ పోతూ ఉంది. తాజాగా నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రియాంక అదిరిపోయే గెటప్.. డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంది. అందరిని సర్ ప్రైజ్ చేసింది.
ముఖ్యంగా ఆమె వేసుకున్న పాపు నెక్ట్సె స్పెషల్ గా మారింది. ఇక పాము నెక్లెస్ చూడడానికి చాలా వెరైటీగా కనిపించడమే కాదు.. దాని ధర కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ప్రియాంక చోప్రా వేసుకున్న ఆ పాము నెక్లెస్ ధర ఎంతో తెలుసా..? ఆ స్నేక్ నెక్లెస్ ధర అక్షరాల 60 లక్షలట. అంత కాస్ట్ పెట్టి కొన్న ఈ నెక్లెస్ సింపుల్ గా ఉంది. దాంతో ఇంత సాదాగా ఉన్న నగ అంత రేటా అని నెటిజన్లు నోరు వెళ్ళబెడుతున్నారు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ విషయంలో రకరకరాల కామెంట్లు చేస్తున్నారు.