- Home
- Entertainment
- Urvashi Rautela : ఊర్వశీ రౌటేలా పుట్టిన రోజు.. హాట్ టాపిక్ గ్గా బర్త్ డే కేక్... హనీసింగ్ మాములోడు కాదుగా!
Urvashi Rautela : ఊర్వశీ రౌటేలా పుట్టిన రోజు.. హాట్ టాపిక్ గ్గా బర్త్ డే కేక్... హనీసింగ్ మాములోడు కాదుగా!
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) పుట్టిన రోజు వేడుకలు ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారాయి. అందుకు కారణం ఆమె కట్ చేసిన కేక్ ప్రత్యేకమైనది కావడమే....

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా సౌత్ ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైన విషయం తెలిసిందే. తన అందంతో ఈ ముద్దుగుమ్మ దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
పదేళ్లకు పైగా ఊర్వశీ రౌటేలా ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో, ఇటు సౌత్ లో ఆయా చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్పెషల్ డాన్స్ లకు స్పెషలిస్ట్ అని చెప్పాలి.
బాలీవుడ్ లో నటిగా కంటే ఐటెం సాంగ్స్ ల్లో, ప్రైయివేట్ ఆల్బల్స్ లో నటించే ఊర్వశీ రౌటేలా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక తెలుగు గతేడాది వరుసపెట్టి సినిమాల్లో గ్లామర్ స్టెప్పులేసి అదరగొట్టింది.
‘వాల్తేరు వీరయ్య’, ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ వంటి చిత్రాల్లో స్పెషల్ అపీయరెన్స్ తో ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. నెక్ట్స్ మరోసారి చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’లో నటించబోతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఊర్వశీ రౌటేలా ఈరోజు తన 30వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆమెను బర్త్ డేను ప్రముఖ సింగర్ యోయో హనీసింగర్ (YoYo Honey Singer) సెలబ్రేట్ చేశారు. Love Dose 2 సాంగ్ సెట్స్ లో వేడుకలు జరిపారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అయితే ఊర్వశీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కట్ చేసిన కేక్ హాట్ టాపిక్ గ్గా మారింది. ఊర్వశీ కోసం యోయో హనీసింగ్ 24 క్యారెట్ల బంగారు పూతతో కేక్ తయారు చేయించడం ఆసక్తికరంగా మారింది. తన బర్త్ డేకు సర్ ప్రైజ్ చేసిన హనీసింగ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.