MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్లు విలువచేసే లగ్జరీ కారు కొన్న శ్రద్ధా కపూర్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

కోట్లు విలువచేసే లగ్జరీ కారు కొన్న శ్రద్ధా కపూర్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. సోషల్ మీడియాలో కారు ఫొటోలు, ధర వైరల్ గా మారాయి. అలాగే కొత్తకారుతో నెటిజన్ల నుంచి పలు విమర్శలనూ ఎదుర్కొంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 26 2023, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తాజాగా లగ్జరీ కారు కొనుకుంది. దసరా సందర్భంగా కోట్లు విలువచేసే లంబోర్గిని కారును సొంతం చేసుకుంది. తాజాగా కారును డ్రైవ్ చేస్తూ ముంబైలోని జూహు వీధుల్లో కనిపిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ లో తన కొత్తకారుకు పూజలు చేయించేందుకు శ్రద్ధా కపూర్ స్వయంగా డ్రైవ్ చేస్తూ ఆలయానికి వెళ్లింది. ప్రత్యేక పూజలు చేసింది. లంబోర్గిని హురాకాన్ టెక్నికా కారును శ్రద్ధా ఏకంగా రూ. 4 కోట్ల వరకు ఖరీదు చేసి కొనుగోలు చేసింది. ఆ కారు ధర షాకింగ్ ఉండటం విశేషం. 
 

36

అయితే, కారు కొన్న సంతోషంలో శ్రద్ధా తనే డ్రైవ్ చేసుకుంటూ వీధుల్లోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. తనపై పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కారు మూలంగా బాలీవుడ్ బ్యూటీ వివాదాల్లో చిక్కుకుంది. హైఎండ్ కారుతో కాలుష్యం ఏర్పడదా అంటూ.. విమర్శిస్తున్నారు. 

46

నెటిజన్ల విమర్శలకు కారణం కూడా లేకపోలేదు..  2019లో ముంబైలోని ఆరే ఫారెస్ట్ బెల్ట్‌లో మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో శ్రద్దా కపూర్ చురుకైన పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ కోసం యాక్టివిస్ట్ గానూ అవతారం ఎత్తింది. 
 

56

ఈ క్రమంలో ఆమె లంబోర్ఘినిని కొనుగోలు చేయాలనే నిర్ణయం.. తీరా సోషల్ మీడియాలో కారు ఫొటోలు వైరల్ గా మారడంతో పలువురు మండిపడుతున్నారు. గతంలో ‘సేవ్ ఆరే’ అనే టీషర్ట్  ధరించి చేసిన నిరసన ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ‘సేవ్ ఆరే’పై మీ కమిట్ మెంట్ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. 

66

ఏదేమైనా శ్రద్ధా కపూర్ తన కొత్తకారుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా లీటర్ పెట్రోల్ కు 7 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది.  శ్రద్ధా కపూర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా Tu Jhoothi Main Makkaar అనే చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ‘స్ట్రీ2’లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Recommended image2
Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?
Recommended image3
Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved