- Home
- Entertainment
- శ్రీలంకలో సొంతంగా ద్వీపం కలిగి ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రభాస్‌తో రొమాన్స్ చేసి రచ్చ
శ్రీలంకలో సొంతంగా ద్వీపం కలిగి ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రభాస్‌తో రొమాన్స్ చేసి రచ్చ
బాలీవుడ్‌లోని ఈ అందగత్తెకి సొంతంగా ఒక ద్వీపం ఉంది. ఆ నటి దీపికా పదుకొనే కాదు, ఆలియా భట్ కూడా కాదు. మరి ఎవరో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
jacqueline fernandez
ఈ నటి భారతీయురాలు కాదు. కానీ 2009లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందగత్తె, బాలీవుడ్‌లో స్థిరపడటంలో విజయం సాధించారు. అంతేకాదు, ఒక పాట ద్వారా కన్నడ ఆడియెన్స్ మనసులను కూడా గెలుచుకున్నారు. తెలుగులో ప్రభాస్ ఓ మెరుపు మెరిశారు.
ఈ నటి తన కెరీర్‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, ఇమ్రాన్ హష్మీ, మన కిచ్చ సుదీప్ సహా చాలా మంది స్టార్ నటులతో కలిసి పనిచేశారు. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు తెలిసి ఉండాలి కదా? ఆ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
శ్రీలంక నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడి, వరుస హిట్ సినిమాలు ఇచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్రమంగా ఫ్లాప్ చిత్రాలు ఇవ్వడం ప్రారంభించారు, దీనివల్ల ఆమె కెరీర్ దెబ్బతింది. జాక్వెలిన్ సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా, ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పాపులర్ హీరోయిన్లలో ఒకరు.
అంతేకాకుండా, జాక్వెలిన్ బాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే నటీమణులలో ఒకరు. ఆమె ఒక్కో సినిమాకి పారితోషికం కోట్లలో ఉంటుందని బాలీవుడ్ చెబుతోంది.
అదంతా పక్కనబెడితే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి మీకు ఒక విషయం తెలుసా? ఆమె తన స్వస్థలమైన శ్రీలంకలోని దక్షిణ తీరంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశారు. అవును, ఆ నటి శ్రీలంకలో తన సొంత ద్వీపాన్ని కలిగి ఉంది.
జాక్వెలిన్ 2012లో ఆ ల్యాండ్‌ని కొనుగోలు చేశారు. నివేదికల ప్రకారం, జాక్వెలిన్ అక్కడ ఒక విలాసవంతమైన విల్లాను నిర్మించాలనుకున్నారు. ఈ ద్వీపం కొనుగోలు కోసం నటి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తుల విలువ దాదాపు రూ.115 కోట్ల రూపాయలు అని చెబుతారు. నటి తన కెరీర్‌లో హెచ్చు తగ్గులను చవిచూస్తూ బాలీవుడ్‌లో స్థిరపడటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నటి చేతిలో `హౌస్‌ఫుల్ 5`, `వెల్కమ్ టు జంగిల్` అనే రెండు సినిమాలు ఉన్నాయి.