అత్యధిక రేప్ సీన్లలో నటించిన నటి.. కానీ 27 ఏళ్లకే!
ఈ జనరేషన్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్ అయిపోయాయి. హీరోయిన్ బెడ్ రూమ్స్ సీన్స్‌లో కూడా నటించేస్తున్నారు. కానీ ఒకప్పుడు హాట్ సీన్ చేయడానికి తారలు అంగీకరించేవారు కాదు. ముఖ్యంగా 70లలో రేప్ సీన్స్‌లో నటించే నటీమణులు చాలా తక్కువ అలాంటి సమయంలో అత్యధిక రేప్ సీన్స్‌లో నటించిన నటి నజీమా. చేసింది తక్కువ సినిమాలే అయిన అతి ఎక్కువగా బోల్డ్ సీన్స్ చేసిన రికార్డ్ సృష్టించింది ఈ నటి.
60, 70ల కాలం నాటి బాలీవుడ్ సినిమాలతో పరిచయం ఉన్న వాళ్లకు నజీమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30కి పైగా సినిమాల్లో నటించిన ఈమె చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూసింది.
అందంగా, అమాయకంగా కనిపించే నజీమాను ఎక్కువగా చెల్లెలు, స్నేహితురాలి పాత్రల్లో నటించింది.
నజీమా 1948లో నాసిక్‌లో పుట్టింది. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
60, 70లలో మహిళల పట్ల సమాజంలో వివక్ష ఉండేది. అదే సినిమాల్లోనూ ప్రతిభింబించేది. అలాంటి పాత్రలకు ఎక్కువగా నజీమానే ఎంచుకునే వారు దర్శక నిర్మాతలు.
హిందీ సినిమాల్లో అత్యధికంగా రేప్ సీన్లలో నటించిన నటీమణి నజీమా.
ఆమె నిషన్ (1965), అర్జు (1965), దిల్లాగి, (1966), తమన్నా (1969), మరియు అంజనా (1969) చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది.
నజీమా 1972 చిత్రం 'బీమన్' ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది.
నజీమా 1975లో మరణించింది. ఆమె చివరి చిత్రం లవ్ అండ్ గాడ్ ఆమె చనిపోయిన తరువాత రిలీజ్ అయ్యింది. 27 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించింది నజీమా.