- Home
- Entertainment
- వన్ షోల్డర్ గౌన్ లో బోల్డ్ బ్యూటీ మైండ్ బ్లాక్ పోజులు.. భూమి పెడ్నేకర్ ఓర చూపులకు గుండెలు గల్లంతే!
వన్ షోల్డర్ గౌన్ లో బోల్డ్ బ్యూటీ మైండ్ బ్లాక్ పోజులు.. భూమి పెడ్నేకర్ ఓర చూపులకు గుండెలు గల్లంతే!
బ్లాక్ అవుట్ ఫిట్ లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ మతులు పోగొడుతోంది. క్రేజీ ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ పోజులిస్తూ కుర్రగుండెల్లో గంటలు మోగిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ అందాల రచ్చ చేస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంటోంది.
2015లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అవకాశాలను అందుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది. తనదైన శైలిలో వెండితెరపై పెర్ఫామ్ చేస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.
ఇడస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి భూమి పెడ్నేకర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మరోవైపు గ్లామర్ విందులోనూ భూమి ఎప్పుడో హద్దులు దాటేసింది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా పేరొందింది. భూమి చేసే ఒక్కో ఫొటోషూట్ ఇంటర్నెట్ షేక్ అయ్యేలా ఉండేవి. గ్లామర్ షోతో పాటు ఇటు ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా భూమి పెడ్నేకర్ ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో తళుక్కున మెరిసింది. మిరుమిట్లుగొలిపే నల్లటి గౌనులో భూమి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వన్-షోల్డర్ గౌనుతో ఫ్యాషన్ కు కేరాఫ్ గా మారుతోంది. టైట్ ఫిట్ లో భూమి ఇచ్చిన పోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మైండ్ బ్లాక్ స్టిల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేయడంతో పిక్స్ కై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
కేరీర్ విషయానికొస్తే.. భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. చివరిగా అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బందన్’లో మెరిసింది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్ ను లీడ్ చేస్తోంది. భారీగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.