బట్టలు విప్పుతున్న వీడియో లీక్ చేశారు.. బాలీవుడ్ నటి భూమిక వశిష్ట్ ఆవేదన
తన జీవితంలో జరిగిన ఓ చీకటి రోజును, తన వల్ల తనకు జరిగిన ఓ నష్టాన్ని రియాల్టిషో ద్వారా చప్పుకొచ్చింది బాలీవుడ్ నటి భూమిక వశిష్ట్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈమధ్య రియాల్టీ షోలు చాలా ఎక్కువయ్యాయి. బుల్లితెరపై రియాల్టీషోలకు ఉన్న డిమాండ్ వేటికీ లేదు. వీటి వల్ల సెలబ్రిటీల లైఫ్ స్టైల్ తో పాటు.. వారి పర్సనల్ విషయాలు కూడా అభిమానులకు తెలుస్తున్నాయి. ఈక్రమంలోనే ఓ బాలీవుడ్ రియాల్టీ షో వల్ల.. నటిభూమిక వశిష్ట్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలిసింది. దాని వల్ల తాను ఎంత డిఫ్రెషన్ ఫీల్ అయ్యింది వెల్లడించింది భూమిక.
రియాల్టీ షో లలో వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటారు సెలబ్రిటీలు. ఆ క్రమంలోనే వారి వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడటంలేదు సెలబ్రిటీలు. వారు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కూడా కలిపి రియాల్టీ షోల ద్వారా ఫ్యాన్ కు తెలిసేలా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో ఎంటీవీ రోడీస్ అనే కొత్త సీజన్ శనివారం రోజున గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.
ఇందులో భూమిక వశిష్ట్ స్ప్లిట్స్ విల్లా కంటెస్టెంట్ గా ఏంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆ షో లో వ్యక్తం చేసింది భూమిక వశిష్ట్. ఇక ఆమె మాట్లాడుతూ.. డాన్స్ రియాల్టీ షో తర్వాత నేను సెలబ్రటీలా ఉండిపోవాలనుకుంటున్నాను.. కానీ అది అంత ఈజీగా జరిగే పనికాదు అన్నారు భూమిక.
సెలబ్రిటీ లైఫ్ అనేది ప్రతీ విషయంలో డబ్బుతో కూడుకున్న పని.. దానికి కావల్సిన ఫేమ్, గ్లామర్ ఉండాలి. అందు కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. అన్నారు. అందుకని నా లైఫ్ స్టైల్ కోసంఖర్చులు భరించేంత డబ్బు నాదగ్గర లేదు. దాంతో చేసేది లేక అప్పు తీసుకున్నాను అని చెప్పింది భూమికా వశిష్ట్.
అదే సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియో ఒక యాప్ లో ఆప్ లోడ్ చేశాను.. సీక్రెట్ గా ఉండాల్సిన వీడియో ఎవరో లీక్ చేశారు. అది ఎలా వెళ్లిందని ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యింది భూమిక. ఈ విషయంలో తన పరువు పోయిందంటూ వాపోయింది.
అంతే కాదు నన్ను చులకనగా చూడటంతో పాటు.. నా పై చాలా విమర్శలు చేశారు. నానా మాటలు అన్నారు.అలా వచ్చినందుకు నేను బాగా డిప్రెషన్ కు గురయ్యాను అని బాధను వ్యక్తం చేసింది. భూమిక మాటలు విన్న గ్యాంగ్ లీడర్స్ రియా చక్రవర్తి, ప్రిన్స్ నరూలా భూమికను ఓదార్చారు..
అయితే రియా భూమికను హత్తుకోగా నరూలా మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నువ్వు ధైర్యంగా ఉండమని ఒక్క మాటలో తేల్చేశాడు. ఇక ప్రస్తుతం ఈషోకి మంచి బజ్ ఉంది. సోనూసూద్ ఎంటీవీ రోడీస్ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నప్పటికి.. ఆ షో లో ప్రిన్స్, నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్ గులటి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.