MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి అంటే క్రష్.. మనసులో మాట బయట పెట్టిన బాలీవుడ్ నటుడు.

సాయి పల్లవి అంటే క్రష్.. మనసులో మాట బయట పెట్టిన బాలీవుడ్ నటుడు.

విల్లులా శరీరాన్ని వంచుతూ.. అద్భుతమైన నటన, డాన్స్ స్టెప్పులతో .. డాన్స్ పెర్ఫామెన్స్ లతో అదరగొట్టే క్యూట్ బేబీ సాయి పల్లవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..? అవును ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఇంప్రెస్ అవుతారు ఆమె గురించి తెలిస్తే.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 29 2023, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాయి పల్లవి రూటే సెపరేట్.. ఆమెకు వచ్చిన ఆఫర్లు.. కమర్షియల్ గా ఆలోచించి తీసుకుని ఉంటే.. ఇప్పటికి ఆమె రేంజ్ వేరే లెవల్లో ఉండేది. కాని అలా తీసుకోకపోయినా సరే.. సాయి పల్లవి ఇమేజ్  మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఎంత పెద్ద స్టార్అయినా.. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. అది కూడా హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది. 
 

25
Sai Pallavi

Sai Pallavi

సాయి పల్లవి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామందికి ఆమె ఆదర్శం కూడా. డాక్టర్ చదువుకుంటూనే సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బ్యూటీ. ఈమధ్య సినిమాలు తగ్గించింది చిన్నది. సినిమాలకు గుడ్ బై చెపుతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాని ఆమె మాత్రం ఈవిషయంలో ఏమాత్రం స్పందించలేదు. ఇక ఆమె గురించిబాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

35
Sai Pallavi

Sai Pallavi

సాయి ప‌ల్ల‌వి గురించి బాలీవుడ్ న‌టుడు గుల్షన్ దేవయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వాఖ్యాలు  ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సాయి ప‌ల్ల‌వి అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆమె త‌న క్ర‌ష్ అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు గుల్ష‌న్‌. ఆమె ఫోన్ నంబ‌ర్ త‌న వ‌ద్ద ఉన్న‌ప్ప‌టికి ఈ విష‌యాన్ని ఆమెతో చెప్పే ధైర్యం మాత్రం చేయ‌లేక‌పోయాడ‌ట‌. 
 

45
Gulshan Devaiah Sai pallavi

Gulshan Devaiah Sai pallavi

అంతే కాదు ఆమెతో న‌టించే అవకాశం వ‌స్తే  అది తన  త‌న అదృష్టంగా బావిస్తానంటూ ఆమెపై త‌న‌కు ఉన్న ఇష్టాన్ని బ‌య‌ట‌ప‌ట్టేశాడు. సాయి ప‌ల్ల‌వి అద్భుత‌మైన న‌టి, డ్యాన్స‌ర్. ఆమె న‌టించిన సినిమాలు అన్నింటిని చూస్తాను. చాలా కాలం నుంచి ఆమెఅంటే  ఇష్టం. కాని ఆ విషయం చెప్పలేను అంటూ కామెంట్స్ చేశాడు. ఆమె అంటే  నాకు క్ర‌ష్ మాత్ర‌మే. అంత‌కు మించి ఏమీ లేదని అనుకుంటున్నా అని అన్నారు గుల్షన్. 
 

55

2010 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు గుల్షన్. ది గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. గతేడాది ‘బదాయ్ దో’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం ‘లవ్ ఎఫైర్’ తో పాటు మరో చిత్రంలో నటిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
Recommended image3
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved