- Home
- Entertainment
- 'నువ్వు నాకు నచ్చావ్' మూవీలో బ్లండర్ మిస్టేక్.. పాపం పింకీని అడ్డంగా బుక్ చేశారుగా
'నువ్వు నాకు నచ్చావ్' మూవీలో బ్లండర్ మిస్టేక్.. పాపం పింకీని అడ్డంగా బుక్ చేశారుగా
విక్టరీ వెంకటేష్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఒకటి. ఇప్పటికి ఈ చిత్రం టీవీల్లో వస్తే ఇంటిల్లిపాది మొత్తం చూడడానికి కుర్చునేస్తారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగులు భలే ఉంటాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

విక్టరీ వెంకటేష్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఒకటి. ఇప్పటికి ఈ చిత్రం టీవీల్లో వస్తే ఇంటిల్లిపాది మొత్తం చూడడానికి కుర్చునేస్తారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, విజయ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగులు భలే ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా ఆర్తి అగర్వాల్ నటించింది.
అప్పట్లో సినిమాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ నడిచిపోయేవి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రాభవం అప్పట్లో లేదు. కానీ ప్రస్తుతం నెటిజన్లు ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చిన్న పొరపాటు దొర్లినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అవుతుంది.
పాత చిత్రాల్లో తప్పిదాలని కూడా ఇప్పుడు నెటిజన్లు వెతికి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని ఓ బ్లండర్ మిస్తకె ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ చెల్లి పాత్రలో పింకీ నటించింది. ఆమె పాత్ర కూడా చాలా ఫన్నీగా ఉంటుంది.
వెంకటేష్ ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చినప్పుడు ఒక కామెడీ సన్నివేశంలో వెంకటేష్ ని పరిచయం చేసుకుంది. ఈ క్రమంలో తన పేరు, చదివే స్కూల్, అడ్రెస్ అన్ని చెబుతుంది. తన స్కూల్ పేరు లిటిల్ క్లాస్ అని చెబుతుంది. తాను 9 వ తరగతి చదువుతున్నట్లు కూడా పేర్కొంటుంది.
కానీ పింకీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్కూల్ బస్సు ఎక్కుతుంది. ఆ స్కూల్ బస్సుపై మాత్రం బివిబిపి స్కూల్ అని రాసి ఉంటుంది. స్కూల్ పేరు ఒకటి చెప్పి మరో స్కూల్ బస్సు ఎక్కడం ఏంటి అంటూ ఈ మిస్టేక్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో చాలా చోట్ల ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న పొరపాట్ల వల్ల సినిమాకి నష్టం ఏమి లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం హైలైట్ అవుతాయి. ఈ చిత్రంలో చాలా కామెడీ సన్నివేశాల్లో వెంకటేష్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్ ల హావ భావాలని నెటిజన్లు ఇప్పటికీ మీమ్స్ రూపంలో వాడుతున్నారు.