- Home
- Entertainment
- పీవీఆర్-ఐనాక్స్ మల్టీప్లెక్స్ లపై తిరగబడ్డ ప్రభాస్ అభిమానులు.. షారూఖ్, డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య కొత్త వార్
పీవీఆర్-ఐనాక్స్ మల్టీప్లెక్స్ లపై తిరగబడ్డ ప్రభాస్ అభిమానులు.. షారూఖ్, డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య కొత్త వార్
ప్రభాస్, షారూఖ్ ఫ్యాన్స్ మధ్య పీవీఆర్ చిచ్చు పెట్టింది. ఇద్దరు హీరోల అభిమానులు కొట్టుకునేలా చేస్తుంది. ప్రస్తుతం `సలార్`, `డంకీ ` సినిమా విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతుంది.

ప్రభాస్ నటించిన `సలార్` సినిమా భారీ స్థాయిలో ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రపంచం వెయిట్ చేస్తుంది. `కేజీఎఫ్` తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న సినిమా కావడం, మరోవైపు ప్రభాస్ నుంచి వస్తోన్న సాలిడ్ యాక్షన్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. దీంతో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఒక్క రోజు ముందే `డంకీ` సినిమా రిలీజ్ కాబోతుంది. షారూఖ్ ఖాన్ నటించిన ఈ మూవీ రేపు థియేటర్లకి రాబోతుంది. `పఠాన్`, `జవాన్` వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లతో జోరుమీదున్న షారూఖ్ ఖాన్.. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఓటమి లేని దర్శకుడు, సక్సెస్ ఫుల్‌గా ఉన్న హీరో కాంబోలో సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి. సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.
దీంతో ఇప్పుడు `సలార్`, `డంకీ` చిత్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. `సలార్` వర్సెస్ `డంకీ` అనేలా మారింది. ముఖ్యంగా థియేటర్ల విషయంలో ఈ పోటీ మరింతగా పెరిగింది. నార్త్ లో `సలార్` చిత్రానికి థియేటర్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా మల్టీఫ్లెక్సుల్లో `సలార్`కి షోస్ ఇవ్వడం లేదు. మొత్తం `డంకీ`కికే కేటాయిస్తున్నారు. ఏదో నామమాత్రంగానే ఇస్తున్నారు. డిమాండ్ ఉన్నా `పీవీఆర్- ఐనాక్స్` ఓనర్స్ `డంకీ`కే థియేటర్లు ఇవ్వడంతో `సలార్`కి తీవ్ర అన్యాయం జరుగుతుంది. తాజాగా అసలు స్క్రీన్లు అన్నీ `డంకీ`కే ఇవ్వాలని పీవీఆర్ హోనర్ అజయ్ బిజ్లీ నిర్ణయం తీసుకున్నారట.
దీంతో పీవీర్-ఐనాక్స్ లపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. `సలార్`కి జరుగుతున్న అన్యాయంపై వాళ్లు మండిపడుతున్నారు. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తమ నిరసనని తెలియజేస్తున్నారు. `బాయ్ కాట్‌పీవీఆర్‌ఐనాక్స్` (#BoycottPVRInox) అనే యాష్ ట్యాంగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీపై వాళ్లు చేస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సౌత్‌లో ఆయా మల్టీప్లెక్సులను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాటిలో సినిమాని ప్రదర్శించవద్దని అంటున్నారు.
మరోవైపు `సలార్` నిర్మాణ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ సైతం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై చర్యలకు దిగబోతుందని సమాచారం. ఇంతటితో వదలకుండా మున్ముందు కూడా ఆయా థియేటర్లలో సౌత్ సినిమాలు ప్రదర్శించే విషయంలో నిబంధనలు పెట్టే దిశగా ముందుకు వెళ్తుందట. సౌత్‌లో ఉండే ఆయా మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు ఇవ్వకపోతే వెలవెల బోవాల్సిందే. పెద్ద సినిమాలు ప్రదర్శించకపోతే పీవీఆర్-ఐనాక్స్ మాల్స్ మూసేసుకోవాల్సిందే. మరి అలాంటి పరిస్థితి వరకు వెళ్లుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ముందు నుంచి ఊహించినట్టే `సలార్`, `డంకీ` సినిమాలు గట్టిగానే పోటీ పడుతున్నారు. ఇది నార్త్, సౌత్ అనే గ్యాప్‌ని పెంచేలా పోటీ పడుతుండటం గమనార్హం. నార్త్ లో `సలార్`కి థియేటర్లు ఇవ్వకపోవడం ఈ చర్యని ప్రతిబింబిస్తుంది. దీంతో ఇప్పుడు ప్రభాస్, షారూఖ్ ఫ్యాన్స్ మధ్య వార్ ప్రారంభమైంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. మీమ్స్, ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. షారూఖ్, పీవీఆర్‌ని మడతబెట్టి కొడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. షారూఖ్ ఫ్యాన్స్ `సలార్`ని చిత్తు చేస్తామంటున్నారు. ఇలా ఇద్దరి మధ్య వార్ పీక్‌లోకి వెళ్లడం గమనార్హం. మరి ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఎక్కడి వరకు వెళ్తుందనే ఆందోళన కలిగిస్తుంది.