- Home
- Entertainment
- ప్రేమ, ఆ ఆశ తీరలేదు.. సరైన వ్యక్తి దొరికితే పెళ్లే కాదు సహజీవనానికైనా ఓకేః కరాటే కళ్యాణి బోల్డ్ కామెంట్
ప్రేమ, ఆ ఆశ తీరలేదు.. సరైన వ్యక్తి దొరికితే పెళ్లే కాదు సహజీవనానికైనా ఓకేః కరాటే కళ్యాణి బోల్డ్ కామెంట్
ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ దొరకలేదు. దాని కోసం ఎదురుచూస్తున్న. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నానంటోన్న కరాటే కళ్యాణి.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కరాటే కళ్యాణి. బోల్డ్ రోల్స్ చేస్తూ మెప్పించింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం `బిగ్‌బాస్ 4`లో పాల్గొని మరింత పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతున్న కరాటే కళ్యాణి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆమె పిల్లల కనాలనే కోరిక తీరలేదని, తనని వాడుకుని వదిలేశారని పలు మార్లు చెప్పి కన్నీరు మున్నీరయ్యింది.
ఇప్పుడు సరైన వ్యక్తి దొరికితే, ప్రేమ దొరికితే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ, గత వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న ఘటనలను తలచుకుని ఎమోషనల్ అవుతుంది. ఆమె చెబుతూ, భార్య అంటే ఇంటికే పరిమితం, భర్త చెప్పినట్టు వినాలి, ఎదురు మాట్లాడకూడదనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ నేను అలా ఉండలేను. ఫైర్ లాంటి దాన్ని అరచేతితో ఆపేయలేరు. నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు` అని తెలిపింది.
అయితే ఈ విషయంలో తాను కరెక్ట్ గానే ఉన్నానని, కాకపోతే నా ప్రవర్తన వాళ్లకి నచ్చలేదు, దీంతో మనస్పర్థలు తలెత్తడం, వరుసగా గొడవలు,అవమానాలు ఎదురుకావడంతో ఆ లైఫ్ నాకు నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. ఇప్పుడు నాకు నచ్చినట్టు జీవిస్తున్నా అని తెలిపింది కరాటే కళ్యాణి. ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదంటూ కల్యాణి వాపోయింది.
ఇంకా ఆమె చెబుతూ, `ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ దొరకలేదు. దాని కోసం ఎదురుచూస్తున్న. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదంటే సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్న. కానీ ఆ ఆశ ఇప్పటికి తీరలేదని పేర్కొంది.
తన మాజీ భర్తల గురించి చెబుతూ, `తరచూ తాగోచ్చి కొట్టడం చేస్తుంటే భరించలేకపోయాను. పైగా నాపై అనుమానం. నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను. తప్పంతా నాదే అంటే ఎలా కుదురుతుంది. అందుకే విడాకులు తీసుకున్నా. కానీ జనాలకు ఇవేం పట్టవు. నేను పడ్డ కష్టాలు ఏ ఆడది పడి ఉండదు. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను.
ఒకానోక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్న. అయిన బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదో ఎదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. పది మంది సాయం చేస్తూ ఇలా ఒంటిరిగా జీవిస్తున్నా` అంటూ తెలిపింది కరాటే కళ్యాణి.