బిగ్‌బాస్ నోయల్ మాజీ భార్య ఎస్తర్.. ఉన్న కొన్ని రోజులైనా బాగానే పట్టిందిగా..
First Published Jan 6, 2021, 4:20 PM IST
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ సీన్ మాజీ భార్య, నటి ఎస్తర్ తాజాగా `వాహ్`లో సందడి చేసింది. నోయల్ లోని టాలెంట్ ని పట్టేసింది. తాజాగా దాన్ని `వాహ్` చూపించింది. తాజాగా ఆ ప్రోమో సందడి చేస్తుండగా, ఉన్నది కొన్ని రోజులైనా బాగానే పట్టేశాంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

భీమవరం బుల్లొడు` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన ఎస్తర్ ర్యాప్ సింగర్, నటుడు నోయల్ సీన్‌ని పెళ్లి చేసుకుంది. ప్రేమించుకున్న వీరిద్దరు 2019 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మనస్పార్థాలు వీరిని దూరం చేశాయి. నెల రోజుల్లోనే వీరి మధ్య గొడవలు ప్రారంభమై విడిపోయారు.

తాజాగా చాలా రోజుల తర్వాత ఎస్తర్ వెలుగులోకి వచ్చింది. `వాహ్` షోలో సందడిచేసింది. సాయికుమార్ హోస్ట్ గా ప్రసారమయ్యే ఈ షోలో ఓ కంటెస్టెంట్‌గా ఎస్తర్ మెరిశారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?