- Home
- Entertainment
- గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా.. తన ఇంటికి కాస్ట్లీ కారు.. ఫస్ట్ డ్రైవ్ ఎవరో తెలిస్తే షాకే
గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా.. తన ఇంటికి కాస్ట్లీ కారు.. ఫస్ట్ డ్రైవ్ ఎవరో తెలిస్తే షాకే
బిగ్‌బాస్(biggboss4) బ్యూటీ అరియానా(ariyana glory).. బిగ్‌బాస్ నాల్గో సీజన్‌తో బాగా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీని మరింత పెంచుకుంటూ వెళ్తోంది. తాజాగా తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాస్ట్లీ కారు(costly car)ని కొనుగోలు చేసి సర్‌ప్రైజ్ చేసింది.

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుని మేల్ కంటెస్టెంట్లకి దీటుగా గేమ్ ఆడింది అరియానా. బోల్డ్ అనే పదానికి సరైనా అర్థాన్నిచ్చింది. తానేంటో బిగ్‌బాస్ హౌజ్‌కి పరిచయం చేసింది.
ఆ తర్వాత సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో కలిసి చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ దుమారం క్రియేట్ చేసింది. ఇది అనేక విమర్శలకు నెలవైంది. ముఖ్యంగా అరియానాని కెమెరా యాంగిల్స్ చూపించిన తీరుపై విమర్శలొచ్చాయి. దీన్ని అరియానా సైతం సానుకూలంగానే తీసుకుంది.
మరోవైపు ఇప్పుడు బిగ్‌బాస్5 షోలో సందడి చేస్తుంది. బిగ్‌బాస్5 బూజ్‌కి ప్రోగ్రామ్‌కి హోస్ట్ గా చేస్తుంది అరియానా. ఇప్పటికే ఆమె ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవిలను ఇంటర్వ్యూ చేసింది. వారితోనూ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింతగా ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే అరియానా తాజాగా తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త కారు కొన్నది అరియానా. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకుంటూ తన కొత్త కారుని ఇంటికి స్వాగతించింది. కొత్త కారు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అని పేర్కొంది.
అరియానా కియా మోడల్ కారుని కొనుగోలు చేసింది. దీని ధర సుమారు పది లక్షలు ఉంటుందని సమాచారం. తన కొత్త కారు ముందు ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంది అరియానా గ్లోరీ.
అయితే ఈ కారుని మాత్రం మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫస్ట్ డ్రైవ్ చేయడం విశేషం. అతను ఎవరో కాదు బిగ్‌బాస్ సెకండ్ రన్నరస్, బిగ్‌బాస్4లో అసలైన విన్నర్‌గా నిలిచిన సోహైల్.
అరియానా కారుని డ్రైవ్ చేయడం విశేషం. ఆయనతోపాటు మరో నటుడు అమర్ దీప్, అరియానా కలిసి కారెక్కి అలా షికారు కొట్టారు.
ఇదిలా ఉంటే బ్లూ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తుంది అరియానా. తాజాగా పంచుకున్న ఈ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెట్టింట దుమారం రేపుతున్నాయి.