MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu: శివబాలాజీ నుంచి రేవంత్ వరకూ.. 6 సీజన్ల విన్నర్స్ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

Bigg Boss Telugu: శివబాలాజీ నుంచి రేవంత్ వరకూ.. 6 సీజన్ల విన్నర్స్ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు.. బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ కు పాకింది బిగ్ బాస్ ట్రెండ్. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా.. ఇండియాలో బిగ్ బాస్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.  తెలుగులో విజయవంతంగా 7వ సీజన్ పూర్తి కావస్తోంది. మరి గత ఆరు సీజన్లలో గెలిచి కప్ సాధించిన విన్నర్స్ ఇప్పుడేం చేస్తున్నారు. ఇండస్ట్రీలో కలిసి వచ్చింది ఎవరికి..?  

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 17 2023, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

తెలుగులో ఇప్పటికే  ఆరు సీజన్లు  విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్ రియాల్టీ షో.  ప్రస్తుతం  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో  ప్రారంభమై.. సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఈరోజు (17 డిసెంబర్) విన్నర్ నుప్రకటించే టైమ్ వచ్చింది. అన్ని అంచనాలు విన్నర్ గా పల్లవి ప్రశాంత్ వైపే చూపిస్తున్నాయి. అసలు విన్నర్ శివాజీ అవ్వాల్సి ఉండగా.. రైతు బిడ్డ ప్రాంత్ ను ఆ అవకాశం వరించినట్టు టాక్. ఇక ఈసీజన్ విన్నర్ సరేసరి.. మరి గత ఆరుసీజన్ల  లె విన్నర్స్ గా నిలిచిన వారు ఏం చేస్తున్నారు. అందులో బిగ్ బాస్ వల్ల కలిసి వచ్చింది ఎవరికి..? చూద్దాం. 
 

26

లాస్ట్ సీజన్.. అంటే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 విజేతగా  సింగర్ రేవంత్ నిలిచాడు. అసలు విజేత శ్రీహాన్ అవ్వగా.. 40 లక్షల క్యాష్ తీసుకుని వెనక్కి తగ్గడంతో.. ఈ అవకాశం రన్నర్ గా ఉన్న రేవంత్ ను వరించింది. ఇక గతంలో సింగర్ గా మంచి ఇమేజ్ ఉంది రేవంత్ కు.. బాగా పాపులర్ కూడా. అంతకు ముందు సోనీ టీవీలో నిర్వహించిన ఇండియన్ ఐడల్‌ 9 విజేతగా నిలిచాడు. ఆ తర్వాత బాహుబలిలో మనోహరి పాటతో ఫేమస్ అయ్యాడు. బిగ్‌బాస్‌లోకి రాకముందే మనోడికి మంచి ఫేమ్ ఉంది. కాని బిగ్‌బాస్  వల్ల మనోడికి పెద్దగా కలిసి వచ్చిందేమి లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇదివరకైనా కాస్త కనిపించేవాడు.. ఇఫ్పుడు అసలే కనిపించడం లేదు  రేవంత్‌. కాని అతనికి బిగ్ బాస్ గెలవడం వల్ల.. 10 లక్షలు అదనంగా క్యాష్ తో పాటు.. సువర్ణభూమి` వారి 650 గజాల ఫ్లాట్‌ కూడా పొందాడు. 

36

ఇక అంతకు ముందు బిగ్‌బాస్... అంటే  సీజన్ 5 విజేత  సన్ని. మైండ్ గేమ్ ఆడుతూ.. ఎవరికీ అంత ఈజీగా దొరకకుండా జాగ్రత్తగా నెట్టుకొచ్చాడు సన్నీ. చిన్న స్థాయి నుంచి.. బిగ్ బాస్ విన్నర్ వరకూ ఎదిగిన సన్నీ.. తనకంటూ  ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో ఓటింగ్ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది.  సన్నీకి బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్‌ ట్రోపీతో పాటు 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్‌లో సువర్ణభూమి నుంచి  25 లక్షలు విలువ చేసే ఫ్లాట్, ఓ టీవీయస్ బైక్ గెలిచారు.అయితే కెరీర్ పరంగా మాత్రం సన్నీ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు స్టార్ గా మారాలని పట్టుదలతో ఉన్నాడు. 
 

46

బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజీత్ . యంగ్ హీరో.. విజయ్ దేవరకొండ కంటే కూడా ముందుగా వచ్చిన స్టార్. కాని కాలం కలిసిరాలేదు అబిజిత్ కు. రెండు మూడు సినిమాలకే అతను ఫెయిడ్ అవుట్ అయ్యాడు. కాని బిగ్ బాస్ లో అవకాశం రావడంతో పాటు.. తన క్యారెక్టర్ తో అందరిని ఇంప్రెస్ చేశాడు అభిజిత్. అంతే కాదు బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించకున్నాడు. కాని ఆతరువాత కెరీర్ పరంగా ఇండస్ట్రీలో అతను ఎదగాలి అనుకోలేదనుకుంటా..? ఎందుకుంటే బిగ్ బాస్ తరువాత అతను వరల్డ్ టూర్లు వేస్తూ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కంప్లీట్ ట్రావెలర్ గా మారి.. దేశాలు చుట్టి వస్తున్నాడు. మరి ముందు ముందు అభిజిత్ కెరీర్ ఎలా ఉంటుందో చ‌ూడాలి 

56

ఇక బీగ్ బాస్ తెలుగు సీజన్లు అన్నింటిలో చాలా స్పెషల్ అంటే.. సెకండ్ సీజన్ విన్నర్ గురించే చెప్పాలి.  కౌశల్ మందా.. ఈ కంటెస్టెంట్ చేసిన హడావిడి బిగ్ బాస్ చరిత్రలో ఎవరూ చేసి ఉండరు. బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చేముందే.. బయట తనకంటూ కొంత పీఆర్ ను సెట్ చేసుకుని.. కౌశల్ ఆర్మిగా దాన్ని పెంచి.. తెగ హడావిడి చేశాడు. హౌస్ లో తనను వేరు చేస్తున్నారు అన్న సింపతీని బాగా క్యాష్ చేసుకుని ఓట్లు సాధించాడు. ఇక బయటకు వచ్చిన తరువాత కూడా తాను పీపుల్ స్టార్ గా ప్రకటించుకుని.. ట్రోల్స్ కు గురయ్యాడు కౌశల్. స్టార్ గా ఎదగాలని ప్రయత్నించిన అతనికి.. చిన్న చిన్న ఓపెనింగ్ లు, సోపల్ మీడియా హడావిడి తప్పించి ఒరిగిందేమి లేదు. అంతే కాదు..అంతకు ముందు వచ్చిన క్యారెక్టర్ రోల్స్ కూడా రాలేదు కౌశల్ కు. ఇక ఇప్పుడు అసలే కనిపించకుండా పోయాడు కౌశల్. ఓ యూట్యూబ్ ఛానెల్ తో పాటు.. కొన్ని బిజినెస్ లు చేస్తున్నాడు. 

66

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు శివ బాలాజీ. అంతకు మందు క్యారెక్టర్ రోల్స్, చిన్న చిన్న సినిమాల్లో హీరో రోల్స్ చేసేవాడు బాలాజీ. ఏమంటా బిగ్ బాస్ కు వచ్చాడో.. అసలు ఇప్పుడు కనిపించకుండా పోయాడు శివబాలాజీ. ఆమధ్య మా ఎలక్షన్స్ లో మంచువిష్ణు పానల్ నుంచి హడావిడి చేశాడు.. కాని ఇప్పుడు అసలుకే తెరమరుగు అయ్యాడు శివబాలాజీ. అంతే కాదు తన భార్య ..నటి మధుమిత స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో అప్పుడప్పుడు కనిపిస్తాడు శివబాలాజీ.. ముందు నుంచి తన ప్యామిలీకి ఉన్న బిజినెస్ లు చూసుకుంటున్నాడని టాక్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
Recommended image3
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved