బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా? ఈసారి హోస్ట్ ఎవరంటే?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. నెక్ట్స్ సీజన్ కు రెడీ అవుతోంది. మరి ఈసారి సీజన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది, హోస్ట్ చేసేది ఎవరు? కంటెస్టెంట్స్ సంగతి ఏంటి?

బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ అయిన రియాల్టీషోలలో బిగ్ బాస్ ఒకటి. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా, బాలీవుడ్ లో బిగ్ బాస్ గా స్టార్ట్ అయ్యి.. టాలీవుడ్ లోకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లు కంప్లీట్ చేసుకుందీ షో.ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ అవుతుందని రూమర్స్ వినిపించిన నేపథ్యంలో బిగ్ బాస్ పై ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.
8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు
వివాదాలు, కాంట్రావర్సీలు, రిస్క్ గేమ్స్, ఆటలు, పాటలతో ప్రతి క్షణం అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ అందించే షో బిగ్ బాస్. టెలివిజన్ రంగంలో సంచలనంగా మారిన ఈ రియాల్టీ షో తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళం భాషలలో విజయవంతంగా రన్ అవుతుంది.
కన్నడలో మనకంటే ముదు ఇది సక్సెస్ అయ్యింది. తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన 8 సీజన్స్ లో రెండు సీజన్లు మాత్రమే ఫెయిల్ అయ్యాయి, దాంతో నెక్ట్స్ సీజన్ ను అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు టీమ్.
2017లో ప్రారంభమైన బిగ్ బాస్ ప్రతి సీజనలో ఎమోషనల్, డ్రామా కంటెంట్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ఇక ఇప్పుడు సీజన్ 9 పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా ఈ సీజన్ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాలలో చక్కర్లు కొడుతుంది. సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవరు హోస్ట్, కంటెస్టెంట్ల సంగతి ఏంటీ అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆతరువాత సెకండ్ సీజన్, 6,7 సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో సీజన్ 8 ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు. ఎదో ఒక విధంగా సీజన్ 8ను సక్సెస్ చేశారు. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ను అన్ని సీజన్ల కంటే మించి ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈక్రమంలో ఈ షో గురించి రకరకాల రూమర్లు వినిపించాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి కాస్త తొందరగా స్టార్ట్ అవుతుందని అన్నారు. వీలైతే సమ్మర్ లోనే స్టార్ట్ అవ్వచ్చు అని కూడా అన్నారు. కాని మే నెల పూర్తయ్యింది, జూన్ లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దాంతో అగస్ట్ లో ఏమైనా ఈ షో స్టార్ట్ అవుతుందా.? లేక ఎప్పటిలాగానే సెప్టెంబర్ లో మొదలవుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపుగా అగస్ట్ లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు హోస్ట్ ఎవరు?
ఇక బిగ్ బాస్ హౌస్ ను నడిపించాలంటే ఆ హోస్ట్ కు చాలా ఓపిక ఉండాలి, హౌస్ లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి. ఆ విషయంలో ఎన్టీఆర్ , నాగార్జున సక్సెస్ అయ్యారు. కాని సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు.
మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే.. సెకండ్ సీజన్ ను నేచురల్ స్టార్ నాని చేశారు. ఇక మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకూ విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున.అయితే ఒకటీ రెండు సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు. దాంతో హోస్ట్ గా నాగార్జునను తప్పిస్తారని రూమర్లు వినిపించాయి.
అంతే కాదు ఈ సీజన్ హోస్టింగ్ విషయంలో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి. కాని ఎప్పటిలాగే ఈ సీజన్ సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జునకు దాదాపు రూ.30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరు?
ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ షోలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సబంధించి పలువురి పేర్లు బయటకు వచ్చాయి. అందులో కుమారి ఆంటీ, ఉదయభాను, బమ్ చిక్ బబ్లూ, అలేఖ్య పికిల్స్ రమ్య మోక్షతో పాటు పలువురు యూట్యూబర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.