కార్తీక దీపం శోభాశెట్టి ఎంగేజ్మెంట్ డే, బిగ్ బాస్ బ్యూటీ పెళ్లెప్పుడంటే?
కార్తీక దీపం ఫేమ్, కన్నడ నటి శోభా శెట్టి నిశ్చితార్థ వార్షికోత్సవాన్ని సోషల్ మీడియాలో జరుపుకున్నారు. ఐదు సంవత్సరాల క్రితం కలుసుకున్న ఈ జంట గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాది అవుతున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో తెలుసా?

తెలుగులో బిజీగా ఉన్న కన్నడ నటి శోభాశెట్టి నిశ్చితార్థ వార్షికోత్సవ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా మొదటి నిశ్చితార్థ వార్షికోత్సవం! ఐదు సంవత్సరాల క్రితం కలుసుకున్నాం! అనంత ప్రేమ. ప్రతిరోజూ ఆరాధన! మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రేమ అని ఆమె రాసుకొచ్చారు.
Also Read: సాయి పల్లవి పై భారీగా ట్రోలింగ్, పహల్గాం ఉగ్రదాడిపై హీరోయిన్ ట్వీట్, మండిపడుతున్న నెటిజన్లు
కన్నడ సీరియల్ అగ్నిసాక్షితో పరిచయమైన శోభా శెట్టి, తెలుగు బుల్లితెరపై స్టార్ నటిగా ఎదిగింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ తరువాత మరింత పాపులర్ అయ్యింది శోభా శెట్టి. ఆతరువాత బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షోలో కూడా కనిపించారు శోభా శెట్టి.
Also Read: 32 ఏళ్ళ తరువాత బాలకృష్ణతో విజయశాంతి సినిమా? ఇద్దరు కలిసి చేసిన చివరి సినిమా ఏదో తెలుసా?
బిగ్ బాస్ 7లో తెగ హడావిడి చేసింది శోభా శెట్టి. బాగా కాంట్రవర్సీ కూడా అయ్యింది. ఫేక్ గేమ్ ఆడి తిట్లు కూడా తిన్నది శోభా. కొన్ని గేమ్స్ లో అద్భుతంగా పోటీ పడ్డ శోభాశెట్టి, టాప్ 7లో నిలిచారు. తెలుగు బిగ్ బాస్ తరువాత కన్నడ బిగ్ బాస్ 11లో కూడా పాల్గొన్నారు శోభాశెట్టి.
Also Read: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్, సముద్ర తీరం, కొండల నడుమ కుమ్టాలో భారీ సెట్టింగ్
అగ్నిసాక్షి సీరియల్ లో తను పాత్రలో నటించిన శోభా శెట్టి, నమ్మ రుక్కు సీరియల్ లో కూడా నటించారు. సహనటుడు యశ్వంత్ రెడ్డితో గత సంవత్సరం నిశ్చితార్థం జరిగింది.
శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిలది ప్రేమ వివాహం. కార్తీక దీపం సీరియల్ లో ఇద్దరూ నటించారు. బిగ్ బాస్ షోలో వీరి ప్రేమ బయటపడింది.
పడువారహళ్లి పడ్డెగళ్ళు సీరియల్ తో శోభా శెట్టి కెరీర్ ప్రారంభమైంది. తెలుగు ఇండస్ట్రీలో ఆమె పాపలర్ అవ్వడంతో పాటు బాగా సంపాదించింది కూడా. హైదరాబాద్ లో సొంత ఇల్లుప కూడా కొనుగోలు చేశారు. ఆమెకు యూట్యూబ్ ఛానల్ తో పాటు బ్యూటీ పార్లర్ వ్యాపారం కూడా ఉంది. అయితే వీరి పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.