హోరాహోరీగా ఓటింగ్, టైటిల్ గెలిచేది ఎవరు? మారిపోతున్న సమీకరణాలు!
అతి కీలకమైన చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. టైటిల్ ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆడియన్స్ మనసు గెలిచిన వారిదే టైటిల్ కాబట్టి, ఓటింగ్ డిసైడ్ చేయనుంది. ఇప్పటి వరకు ఎవరు టాప్ లో ఉన్నారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నవంబర్ 15న ముగియనుంది. నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ ఫైనల్ కి వెళ్లారు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా తన బెర్త్ టాప్ 5 లో కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓట్లు వేసి టైటిల్ రేసులో నిలిపారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు.
Bigg boss telugu 8
సీజన్ 7లో 6 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి పంపారు. అంబటి అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫైనలిస్ట్స్. ఈసారి కూడా ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురిని ఫైనల్ కి పంపుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఓటింగ్ లో వెనకబడిన రోహిణి, విష్ణుప్రియలు 14వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ కి వెళ్లాలన్న వీరి ఆశలు గల్లంతు అయ్యాయి.
ఇకమూడు వారాలుగా ఇద్దరు కంటెస్టెంట్స్ పేరు టైటిల్ రేసులో వినిపిస్తున్నాయి. నిఖిల్, గౌతమ్ లలో ఒకరు టైటిల్ విన్నర్ అంటున్నారు. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ లలో సత్తా చాటాడు. నిఖిల్ దే టైటిల్ అనుకుంటున్న తరుణంలో గౌతమ్ నుండి అతనికి గట్టి పోటీ ఎదురవుతుంది.
చివరి వారం ఓటింగ్ లో కూడా వీరి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గౌతమ్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో నిఖిల్ ఉన్నారట. అయితే ఓట్ల తేడా చాలా స్వల్పం అట. జస్ట్ పాయింట్స్ లో డిఫరెన్స్ ఉందట. నిఖిల్ నాన్ లోకల్ అనేది అతనికి మైనస్. అదే సమయంలో గౌతమ్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ మైనస్. ఇక ప్రేక్షకులు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.
Bigg boss telugu 8
ఇక మూడవ స్థానంలో ప్రేరణ, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నాడట. ఐదవ స్థానంలో అవినాష్ కొనసాగుతున్నాడట. ఓటింగ్ లో అవినాష్ భారీగా వెనుకబడ్డాడని సమాచారం. మిగతా నలుగురితో పోల్చుకుంటే అవినాష్ కి అత్యల్పంగా ఓటింగ్ నమోదు అవుతుందట.
కాగా లేటెస్ట్ సీజన్లో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందట. కేవలం 4 గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ కి వెళతారట. టాప్ 5 కన్ఫర్మ్ అయ్యారు కదా.. నలుగురు ఫైనల్ కి వెళ్లడం ఏమిటని మీకు సందేహం రావచ్చు. సాధారణంగా ఫైనల్ లో కంటెస్టెంట్స్ కి హోస్ట్ నాగార్జున డబ్బులు ఎర వేస్తాడు. టైటిల్ రేసు నుండి తప్పించేందుకు ప్రైజ్ మనీ నుండి కొంత డబ్బు ఆఫర్ చేస్తాడు. టైటిల్ గెలిచేది ఒక్కరే. గెలవని వాళ్లకు ఏమీ దక్కదు. కాబట్టి ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని, వెళ్లిపోవచ్చని టెంప్ట్ చేస్తాడు.
టైటిల్ కొడతామని నమ్మకం లేని వాళ్ళు రూ. 20 లక్షలు తీసుకుని మిడ్ వీక్ లో ఎలిమినేట్ కావచ్చని బిగ్ బాస్ ఆఫర్ చేస్తాడట, ఈ ఆఫర్ ని అవినాష్ తీసుకున్నాడని సమాచారం. అవినాష్ కి టైటిల్ కొడతానని కొంచెం కూడా నమ్మకం లేదు. 11వ వారం నబీల్ అవిక్షన్ షీల్డ్ వాడి సేవ్ చేశాడు. ఇక టికెట్ టు ఫినాలే గెలవడం వలన రెండు వారాలు నామినేషన్స్ లో లేకుండా నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు.
కాబట్టి అవినాష్ కి 4వ లేదా 5వ స్థానం మాత్రమే దక్కుతుంది. పైగా నిఖిల్ -గౌతమ్ మధ్యే టైటిల్ పోరు అనే విషయం హౌస్లో లీకైంది. కాబట్టి డబ్బులు తీసుకుని తప్పుకోవడం బెస్ట్ ఆప్షన్. అవినాష్ అదే చేశాడట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంత వరకు నిజం ఉందో తెలియదు..