MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రేయ్ ఇదంతా ఆపేయ్, నేను యాక్షన్ లోకి దిగితే మామూలుగా ఉండదు, బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ వార్నింగ్

రేయ్ ఇదంతా ఆపేయ్, నేను యాక్షన్ లోకి దిగితే మామూలుగా ఉండదు, బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తనపై దుష్ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసన్న నిఖిల్.. ఇదంతా బంద్ చేయకపోతే మామూలుగా ఉండదంటూ లైవ్ లో రెచ్చిపోయాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 20 2024, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ముగిసింది. 14 మంది రెగ్యులర్, 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాల్గొన్న లేటెస్ట్ సీజన్ కి గాను అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్ ఫైనల్ కి వెళ్లారు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచిన కారణంగా నేరుగా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. 

టైటిల్ పోరు నిఖిల్-గౌతమ్ మధ్యనే అంటూ గత నాలుగు వారాలుగా ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో అవినాష్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అవుతారని ముందే ప్రేక్షకులు ఊహించారు. అవినాష్ కి 5వ స్థానం దక్కింది. 4వ స్థానంలో ప్రేరణ, 3వ స్థానంలో నబీల్ నిలిచారు. ఇక నిఖిల్, గౌతమ్ లలో టైటిల్ ఎవరిదే ఉత్కంఠ నెలకొంది.  

26

నాగార్జున సూట్ కేస్ సైతం ఆఫర్ చేశాడు. ఇద్దరిలో గెలిచేది ఒకరే కాబట్టి.. డబ్బులు తీసుకుని ఒకరు టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని సూచించాడు. నిఖిల్, గౌతమ్ అందుకు నిరాకరించారు. ఫైనల్లీ హోస్ట్ నాగార్జున గెస్ట్ రామ్ చరణ్ ఎదుట.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ని రివీల్ చేశాడు. నిఖిల్ చేయి పైకెత్తి అతడిని విజేతగా ప్రకటించాడు. గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడం వలనే టైటిల్ చేజారిందనే వాదన వినిపించింది. 

 

36

ఇదిలా ఉంటే నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తుంది. కన్నడ నటుడికి బిగ్ బాస్ తెలుగు టైటిల్ ఎలా ఇస్తారు. గౌతమ్ మాత్రమే టైటిల్ అందుకునేందుకు అర్హుడు అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిఖిల్ ని ట్రోల్ కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక తన మీద ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలుసుకున్నట్లు నిఖిల్ చెప్పాడు. 

46

వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్న నిఖిల్... కన్నడ, తెలుగు అనే భాషా భేదం తనకు లేవని అన్నాడు. నన్ను నిఖిల్ అని మాత్రమే పిలుస్తారు. నువ్వు కన్నడా తెలుగా? అని ఎవరు అడగరు అన్నారు. తాను విన్నర్ గా టైటిల్ పైకి ఎత్తగానే అమ్మ, తమ్ముడు భావోద్వేగానికి గురయ్యారని నిఖిల్ వెల్లడించారు. 

56

ఇకపై తనపై ట్రోలింగ్ కి పాల్పడుతుంది. దుష్ప్రచారం చేస్తుంది ఎవరో నాకు తెలుసని నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాడు ఇవన్నీ ఆపేస్తే బాగుంటుంది. నాపై ఎంత దుష్ప్రచారం చేసినా, ట్రోల్ చేసినా పర్లేదు. నేను తీసుకుంటాను. కానీ కుటుంబ సభ్యులను, ఇష్టమైన వ్యక్తులను దీంట్లోకి లాగవద్దు. నేను యాక్షన్ లోకి దిగితే మామూలుగా ఉండదు.. అంటూ నిఖిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరి నిఖిల్ వార్నింగ్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. 

 

66

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్.. రూ. 55 లక్షల ప్రైజ్ మనీ గెలిచారు. ఒక కారు సైతం గిఫ్ట్ గా లభించింది. అయితే ట్యాక్స్ రూపంలో కటింగ్స్ ఉంటాయి. నిఖిల్ గెలుచుకున్న మొత్తంలో దాదాపు 40 శాతానికి పైగా కటింగ్స్ రూపంలో పోనుంది. అయితే రెమ్యూనరేషన్ రూపంలో నిఖిల్ రూ. 33.75 లక్షలు పొందారు. ఇందులో పెద్దగా కోతలు ఉండవు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara Movies: 41 ఏళ్ల వయసులో ఇన్ని సినిమాలా? లేడీ సూపర్‌స్టార్ అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Silk Smitha: చిరంజీవి ముందు సిల్క్ స్మిత కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది.! ఆమెతో సీన్ వచ్చేసరికి..
Recommended image3
Adivi Sesh : రెమ్యునరేషన్ భారీగా పెంచిన అడివి శేష్.. డెకాయిట్ సక్సెస్ కలిసోచ్చిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved