బెజవాడ బేబక్క ఎలిమినేషన్ కి 7 షాకింగ్ రీజన్స్!
ఫస్ట్ ఎలిమినేషన్ గా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ కి కారణాలు ఏమిటో చూద్దాం..
బిగ్ బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది భావిస్తారు. కానీ కొందరికే ఛాన్స్ దక్కుతుంది. ఆ అవకాశం వచ్చిన వారు కూడా హౌస్లో ఉండటం అంత ఈజీ కాదు. మొదటి వారమే ఎలిమినేట్ కావడం అనేది దురదృష్టం అని చెప్పొచ్చు. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.
కంటెస్టెంట్స్ ఎవరికీ హౌస్లోకి వెళ్లే వరకు వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలియదు. ఇంటి వాతావరణంతో పాటు గేమ్ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మొదటివారమే ఎలిమినేట్ కావడం ఒకింత మైనస్.
Happy Birthday Pawan Kalyan
గత ఏడు సీజన్స్ లో జ్యోతి, సంజన, హేమ, సూర్య ప్రకాష్, సరయు, షాని, కిరణ్ రాథోడ్ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యారు. సీజన్ 8కి గాను ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన బేబక్క గురించి తెలుసుకుందాం. ఆమె ఎందుకు ఎలిమినేట్ కావాల్సి వచ్చిందో విశ్లేషణ చేద్దాం..
ఫేమ్: 1
నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, సోనియా నామినేషన్స్ లో ఉన్నారు. వారితో పోల్చుకుంటే బేబక్క ఫేమ్ తక్కువ. బేబక్క సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆమెకు పెద్దగా పాపులారిటీ లేదు. ఓట్లు తక్కువగా పడే అవకాశం ఉంది.
వీక్ పాయింట్స్: 2
మరో రీజన్ ఆమె నామినేషన్స్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆమె నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ విషయంలో స్ట్రాంగ్ రీజన్స్ చెప్పలేకపోయింది. అది ఒక మైనస్ అయ్యింది.
అగ్రెసివ్ గా లేకపోవడం:3
బేబక్కకు ఒక వర్గంలో పాజిటివిటీ ఉంది. ఆమె మెచ్యూరిటీ గా మాట్లాడుతుంది. సెట్టిల్డ్ గా ఉంటుంది అనే వాదన ఉంది. అయితే బేబక్క ప్రశాంతంగా ఉండటం కూడా బిగ్ బాస్ మేకర్స్ కి నచ్చకపోవచ్చు. కాంట్రవర్సీ కామెంట్స్ తో కంటెంట్ ఇచ్చే వాళ్లకు మాత్రమే మైలేజ్ ఉంటుంది.
వయసు:4
ఏజ్ బార్ అయిన లేడీ కంటెస్టెంట్స్ ని హౌస్లో ఉంచరు. గతంలో కూడా ఇది నిరూపితం అయ్యింది. హేమ, కరాటే కళ్యాణి, షకీలా, కిరణ్ రాథోడ్ తక్కువ వారాల్లోనే ఎలిమినేట్ అయ్యారు. వయసు పైబడిన బేబక్క హౌస్లో టాస్క్ లలో పెద్దగా రాణించలేదు అని మేకర్స్ భావించే అవకాశం ఉంది.
కంటెంట్:5
బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే ప్రతి చిన్న విషయంలో కలగజేసుకోవాలి. బేబక్క అలా లేదు. ఆమె పెద్దగా కంటెంట్ ఇవ్వడం లేదు. అది కూడా ఓ మైనస్ కావచ్చు. నామినేషన్స్ లో ఉన్న నాగ మణికంఠ, సోనియా ఆకుల, శేఖర్ బాషా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో కంటెంట్ ఇస్తున్నారు.
కలివిడితనం: 6
బేబక్క అందరు కంటెస్టెంట్స్ తో కలిసి ఉండే ప్రయత్నం చేయడం లేదు. ఒకరిద్దరితో మాత్రమే ఆమె బాగుంటున్నారు. చెప్పాలంటే ఆమె ఎక్కువగా శేఖర్ బాషాతో మాట్లాడుతున్నారు. ఇతర కంటెస్టెంట్స్ తో కలవడం లేదు. ఇది కూడా మైనస్ అని చెప్పొచ్చు.
కిచెన్ కే పరిమితం: 7
గేమ్స్, టాస్క్ లలో బేబక్క అంత యాక్టివ్ గా పాల్గొనలేదు. ఒక ఫిజికల్ గేమ్ ఆడేందుకు ఆమె చాలా ఇబ్బంది పడింది. కంటెంట్ ఇవ్వడం మరచి బేబక్క వంట గదికి పరిమితం అయ్యింది. ఇది కూడా ఆమె ఎలిమినేషన్ కి దారి తీసింది.
మొత్తంగా వెరసి బేబక్క సోషల్ మీడియా స్టార్ అయినప్పటికీ ఆమెకు బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండే అర్హత లేదని ప్రేక్షకులు తేల్చారు. అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యింది..