బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్, కన్నడ నటుడికే టైటిల్.. మొత్తం ప్రైజ్ మనీతో సూట్ కేస్ ఆఫర్ చేసినా రిజెక్ట్
గ్రాండ్ ఫినాలేలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నట్లు లేటెస్ట్ టాక్. గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ప్రారంభం అయింది. విష్ణుప్రియ, హరితేజ, నయని పావని తప్ప మాజీ కంటెస్టెంట్స్ అంతా హాజరయ్యారు. సీజన్ 8 లో విజేత ఎవరో తెలిసిపోయింది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ప్రారంభం అయింది. విజేత ఎవరు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ ఫైనల్ కి చేరుకున్నారు. అయితే వీరిలో టైటిల్ బరిలో ముందున్నది మాత్రం గౌతమ్, నిఖిల్ ఇద్దరే. వీరిద్దరిలో విజేత ఎవరనే సస్పెన్స్ కి నాగార్జున తెర దించనున్నారు.
గ్రాండ్ ఫినాలేలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నట్లు లేటెస్ట్ టాక్. గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ప్రారంభం అయింది. విష్ణుప్రియ, హరితేజ, నయని పావని తప్ప మాజీ కంటెస్టెంట్స్ అంతా హాజరయ్యారు. నాగార్జున వారందరితో సరదాగా ముచ్చటించారు. అయితే గ్రాండ్ ఫినాలే బాగా డ్రమాటిక్ గా ఉండబోతునట్లు తెలుస్తోంది. విజయం నిఖిల్, గౌతమ్ మధ్య దోబూచులాడబోతున్నట్లు టాక్.
నబీల్ 10 లక్షల సూట్ కేస్ తిరస్కరించి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడట. అంటే నబీల్ సెకండ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక టైటిల్ పోటీ గౌతమ్, నిఖిల్ మధ్య మొదలవుతుంది. ఇక్కడే నాగార్జున ఇంటరెస్టింగ్ గేమ్ మొదలు పెట్టారు. బిగ్ బాస్ సీజన్ విజేతగా నిలిచిన వారికి 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు, లగ్జరీ కారు కూడా వస్తుంది. మొదట నాగార్జున టైటిల్ త్యాగం చేసి ఇద్దరిలో ఎవరైనా 40 లక్షల సూట్ కేస్ తీసుకుని వెళ్లిపోవచ్చు అని చెప్పారట. కానీ ఈ ఆఫర్ కి ఇద్దరూ టెంప్ట్ కాలేదు.
దీనితో చివరికి నాగార్జున సూట్ కేస్ ఆఫర్ ని ఏకంగా మొత్తం ప్రైజ్ మని 55 లక్షలుగా ప్రకటించారు. టైటిల్ వదిలేసి సూట్ కేస్ తీసుకుని మొత్తం ప్రైజ్ మనీ 55 లక్షలు లభిస్తుంది. టెంప్ట్ కాకుండా ఉన్నవారికి టైటిల్ తో పాటు లగ్జరీ కారు లభిస్తుంది. నిఖిల్ డబ్బు తీసుకుందుకు కొంత టెంప్ట్ అయ్యాడట. కానీ కుటుంబ సభ్యుల సలహాతో వద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ చివరికి నిఖిల్ టైటిల్ విజేతగా నిలిచి మొత్తం ప్రైజ్ మనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రన్నరప్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ నిలిచాడు.