రంగస్థలం బ్యూటీతో రొమాన్స్, బుర్ర తక్కువ పనితో రూ. 2 కోట్లు పోగొట్టుకున్న గౌతమ్.. మొత్తం అప్పు చేసిన డబ్బే
గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నప్పుడు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో మాత్రం హీరో అయిపోయాడు. రన్నరప్ గా నిలిచినప్పటికీ గౌతమ్ కి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.
గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నప్పుడు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో మాత్రం హీరో అయిపోయాడు. రన్నరప్ గా నిలిచినప్పటికీ గౌతమ్ కి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కసితో గేమ్ ఆడి ఫైనల్ కి చేరుకున్నాడు.
సీజన్ 8 లో గౌతమ్ కి మంచి రెమ్యునరేషన్ లభించింది. 10 వారాలు హౌస్ లో గడిపిన గౌతమ్ మొత్తం 18 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడు. అయితే ఈ రెమ్యునరేషన్ గౌతమ్ కి కంటి తుడుపు చర్య లాంటిది మాత్రమే. ఎందుకంటే గౌతమ్ కి ఆర్థికంగా జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. గతంలో గౌతమ్ డైరెక్టర్ గా, హీరోగా, రచయితగా ఆకాశ వీధుల్లో అనే సినిమా తెరకెక్కించాడు.
తన తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకున్న గౌతమ్, స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ఈ చిత్రం కోసం మొత్తం 2 కోట్ల వరకు ఖర్చు చేశాడు. రంగస్థలం చిత్రంతో గుర్తింపు పొందిన పూజిత పొన్నాడ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తో కలసి బోల్డ్ గానే పూజిత రొమాన్స్ పండించింది. లిప్ కిస్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు బోలెడన్ని ఉన్నాయి. అర్జున్ రెడ్డి తరహాలో గౌతమ్ ఆకాశ వీధుల్లో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
కానీ ఆడియన్స్ నుంచి మాత్రం ఏమాత్రం ఆదరణ లభించలేదు. దీనితో 2 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయింది. డాక్టర్ చదివిన గౌతమ్ సినిమాల మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. బిగ్ బాస్ తో అతడికి గుర్తింపు లభించింది. రన్నరప్ గా నిలిచి బయటకి వచ్చాక ఆకాశ వీధుల్లో చిత్రం గురించి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలియనితనంతో ఆ సినిమా చేశాను. బాగా నష్టపోయాను అని గౌతమ్ తెలిపాడు. రెండేళ్ల కష్టం, 2 కోట్ల డబ్బు ఏదీ గౌతమ్ కి మిగల్లేదు. అయినప్పటికీ సినిమాపై ఇష్టం మాత్రం పోలేదు. త్వరలో మరో చిత్రం చేస్తానని గౌతమ్ అంటున్నాడు.