MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఐదవ కంటెస్టెంట్ హీరో ఆదిత్య ఓం..రెండేళ్లు ఇంట్లో నుంచి బయటకి రాకుండా, కన్నీళ్లు పెట్టించే కష్టాలు

ఐదవ కంటెస్టెంట్ హీరో ఆదిత్య ఓం..రెండేళ్లు ఇంట్లో నుంచి బయటకి రాకుండా, కన్నీళ్లు పెట్టించే కష్టాలు

ఆదిత్య ఓం ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయి ఉండొచ్చు కానీ.. గతంలో లాహిరి లాహిరి లాహిరిలో లాంటి క్రేజీ సూపర్ హిట్ చిత్రంలో హీరోగా నటించాడు. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 02 2024, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Aditya om Bigg Boss8

Aditya om Bigg Boss8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఐదవ కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆదిత్య ఓం ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయి ఉండొచ్చు కానీ.. గతంలో లాహిరి లాహిరి లాహిరిలో లాంటి క్రేజీ సూపర్ హిట్ చిత్రంలో హీరోగా నటించాడు. 

24

ఆదిత్య ఎంట్రీ ఇచ్చేటప్పుడు తన లైఫ్ స్టోరీ ప్లే చేశారు. ఇందులో ఆదిత్య తన లైఫ్ గురించి చెబుతూ.. కాశీలో పుట్టి పెరిగి.. సినిమా పిచ్చి వల్ల ముంబైకి వచ్చినట్లు తెలిపాడు. ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. దీనితో బేసిక్స్ నుంచి ప్రారంభించాల్సి వచ్చింది. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సీరియల్స్ లో నటించినట్లు ఆదిత్య తెలిపాడు. 

34

అనుకోకుండా డైరెక్టర్ వైవీఎస్ చౌదరిని కలవడం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని ఆదిత్య తెలిపారు. తెలుగు ఆడియన్స్ తమ సొంత బిడ్డలా నన్ను ఆదరించారు. 2005 తర్వాత నా  రోజులు మొదలయ్యాయి. వరుసగా నేను నటించిన ఐదారు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. డిప్రెషన్ లో 5 రోజులు రూమ్ నుంచి బయటకి రాలేదు. రెండేళ్లు ఇంట్లోనే ఉండిపోయా. జీవితం అంటే పోరాటం అని గ్రహించా. 

44

మళ్ళీ ముంబై వెళ్లి 2010 నుంచి కెరీర్ మళ్ళీ ప్రారంభించా. ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశా అని ఆదిత్య ఓం తెలిపారు. నాకు ఇంత ఇచ్చిన ఇండస్ట్రీకి, ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో.. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చెరువు పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో సామజిక సేవ చేస్తున్నట్లు ఆదిత్య తెలిపారు. తనని తాను తిరిగి ఆడియన్స్ కి పరిచయం చేసుకునేందుకు బిగ్ బాస్ కి వచ్చినట్లు ఆదిత్య తెలిపారు. నాగార్జునతో సరదాగా ముచ్చటించిన తర్వాత తన పెయిర్ గా నటి సోనియా ఆకులని ఎంచుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishal : సైకిల్‌పై వచ్చి ఓటేసిన విశాల్.. రాజకీయం , ప్రజాసేవ పై హాట్ కామెంట్స్
Recommended image2
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image3
Bhanu Chander: సాయం కోసం ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. ఎలా స్పందిస్తారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved