దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్, ఒక్కడికి తప్ప అందరికీ షాక్.. విన్నర్ ఎవరో తెలిసిపోయింది ?
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫైనల్ సమీపిస్తున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ లో వైల్డ్ కార్డు సభ్యులు, ఒరిజినల్ కంటెస్టెంట్స్ ఉన్నారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫైనల్ సమీపిస్తున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ లో వైల్డ్ కార్డు సభ్యులు, ఒరిజినల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. టైటిల్ ఎవరిని వరిస్తుందో ఆడియన్స్ ఊహించలేకున్నారు. కానీ టైటిల్ కి చేరువగా వెళుతున్న కొందరు సభ్యలు ఉన్నారు. ఆల్రెడీ అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి గ్రాండ్ ఫినాలేకి అర్హత సాధించాడు.
Bigg boss telugu 8
తాజాగా టేస్టీ తేజ, పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకి వచ్చేశారు. ఇక హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, నబీల్, గౌతమ్, రోహిణి, అవినాష్ ఉన్నారు. వీరిలో విజేత ఎవరనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ నిఖిల్, గౌతమ్ లాంటి కంటెస్టెంట్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. 13వ వారం ముగిసింది. 14వ వారం ప్రారంభం అవుతుంది. సహజంగానే ప్రతి వారం లాగే ఈ వారం కూడా నామినేషన్స్ ఉండాలి.
Also Read : గురువుని మించిన శిష్యుడు.. 100 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం ?
కానీ బిగ్ బాస్ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారు. అలాంటి ఇలాంటి ట్విస్ట్ కాదు.. ఆడియన్స్ తో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్. 14 వారం హౌస్ లో ఒక్క అవినాష్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉంటారని బిగ్ బాస్ ప్రకటించారు. అవినాష్ మాత్రం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచాడు కాబట్టి అతడికి మినహాయింపు ఉంటుంది. ఆడియన్స్ నిర్ణయం ప్రకారం మిగిలిన సభ్యులంతా నామినేషన్స్ లో ఉంటారు అని తెలిపారు. దీనితో ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ ఆ విషయంలో తోపు అనుకుంటే.. అంతకి మించేలా మమ్ముట్టి రేర్ రికార్డ్
ఇక ఎలిమినేట్ అయి బయటకి వచ్చిన టేస్టీ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటిల్ ఎవరు గెలుస్తారో తన అభిప్రాయం చెప్పాడు. అయితే టేస్టీ తేజ కామెంట్స్ ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. టేస్టీ తేజ మాట్లాడుతూ.. సీజన్ 8 టైటిల్ ని గౌతమ్ గెలవబోతున్నాడు అని తెలిపాడు. నేను గౌతమ్ గేమ్ దగ్గరుండి చూశా.
Bigg boss telugu 8
గ్రాండ్ ఫినాలేలో టైటిల్ ఎగరేసుకుపోయేది అతడే అనేది తన స్ట్రాంగ్ ఫీలింగ్ అని టేస్టీ తేజ తెలిపాడు. హౌస్ లో గ్రూప్ గేమ్స్ జరుగుతున్నాయి. ఆ గ్రూప్ గేమ్స్ ని రెచ్చగొట్టింది టేస్టీ తేజ అనే నిందపై తేజ సమాధానం ఇచ్చాడు. గ్రూప్ గేమ్స్ జరుగుతున్నాయి అని ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది తానే అని తేజ తెలిపాడు. గ్రూప్ గేమ్స్ ని రెచ్చగొట్టేవాడిని అయితే ఆ మాట అనేవాడిని కాదు అని తెలిపాడు.