MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ కి పెద్ద డిజాస్టర్ తప్పింది, కానీ రెండోసారి దొరికిపోయాడు.. ప్రభాస్, ఎన్టీఆర్ అయితే మరీ దారుణం 

మహేష్ కి పెద్ద డిజాస్టర్ తప్పింది, కానీ రెండోసారి దొరికిపోయాడు.. ప్రభాస్, ఎన్టీఆర్ అయితే మరీ దారుణం 

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది. మహేష్ బాబు గతంలో ఛాలెంజింగ్ అనిపించే చిత్రాలు చాలా చేశారు. టక్కరి దొంగ, నిజం లాంటి చిత్రాలు ఛాలెంజింగ్ రోల్స్ అని చెప్పొచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 01 2024, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది. మహేష్ బాబు గతంలో ఛాలెంజింగ్ అనిపించే చిత్రాలు చాలా చేశారు. టక్కరి దొంగ, నిజం లాంటి చిత్రాలు ఛాలెంజింగ్ రోల్స్ అని చెప్పొచ్చు. మహేష్ నటనతో అదరగొట్టినప్పటికీ ఆ చిత్రాలతో నిరాశ తప్పలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అదే తరహాలో మహేష్ బాబుకి మరో డిజాస్టర్ తప్పింది. సుకుమార్ ఆర్య లాంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబుని డైరెక్ట్ చేయాల్సింది. మహేష్ బాబు కోసం జగడం కథ రాసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయా తర్వాత అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నారు. ఇద్దరితో కుదరకపోయేసరికి రామ్ పోతినేనితో ఆ చిత్రం రూపొందించారు. 

35

జగడం వైవిధ్యమైన కథ. కానీ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ విధంగా మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు. కానీ రెండోసారి దొరికిపోయాడు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం ఎంత పెద్ద ఫ్లాపో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ తర్వాత ఫ్యాన్స్ ఆ చిత్రానికి కల్ట్ మూవీ స్టేటస్ ఇచ్చేశారు. 

45

ఒకే దర్శకుడి చేతిలో రెండు ఫ్లాప్ చిత్రాలు మూటగట్టుకున్న హీరోల జాబితాలో ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ఉన్నారు. మహేష్ ఒక్క సినిమా నుంచి అయినా తప్పించుకున్నాడు కానీ.. ఎన్టీఆర్, ప్రభాస్ మాత్రం రెండుసార్లు ఒకే దర్శకుడికి దొరికిపోయారు. ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో మొదట కంత్రి చిత్రం వచ్చింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మరోసారి మెహర్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఇంకా పెద్ద ఫ్లాప్.. అదే శక్తి చిత్రం. ఈ చిత్రంతో నిర్మాత అశ్విని దత్ బాగా నష్టపోయారు. 

55

ఇక ప్రభాస్ బుజ్జిగాడు చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ నిరాశపరిచినప్పటికీ వెంటనే ఏ నిరంజన్ చిత్రానికి కూడా పూరికి ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా ఫ్లాప్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Recommended image3
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved