MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 7, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆ ఇద్దరు స్టార్లు..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆ ఇద్దరు స్టార్లు..?

ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సరికొత్తగా స్టార్ట్ అయ్యింది. ఉల్టాపల్టా అంటూ.. సీజన్ 7ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు టీమ్. ఇక మరో విషయం ఏంటంటే.. ఈసారి హౌస్ లోకి 14 మంది మాత్రమే రాగా.. మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2023, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం బిగ్ బాస్  తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ నుంచే గట్టిగా గొడవలు, ప్రేమలు ఏడుపులతో హౌస్ అంతా ఉత్కంఠగా సాగుతోంది. అయితే ప్రతీసారి హౌస్ లోకి 16 మంది కంటస్టెంట్స్ సందడి చేసేవారు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. ఈ సారి మాత్రం రావడమే 14 మంది హౌస్ లోకి వచ్చారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ద అవుతున్నట్టు తెలుస్తోంది. 

25

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 Bigg Boss Season 7 Telugu లో  ఉన్న కంటెస్టెంట్స్ చాలామంది ఆడియన్స్ కు పెద్దగా తెలిసినవారు కాదు. సీరియల్స్ రెగ్యూలర్ గా చూసేవారికి మాత్రం అందులో ఓ నలుగురు బాగాపరిచయం ఉండి ఉంటారు. అంత తప్పించి గత సీజన్ లో ఉన్నవారిలో కంటే.. ఈసారి ఉన్నవారు పరిచయం లేని ముఖాలు ఎక్కువగా ఉన్నాయి. ఈక్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 

35

 ఇప్పుడు ఉనన్నవారు చాలా మందికి తెలియదు కాబట్టి..  వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే కాస్త తెలిసిన ముఖాలను తీసుకురావాలి అనిచూస్తున్నారట. అందుకు తగ్గట్టుగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఇప్పటికే రెడీ చేసినట్టు తెలుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పలు సీరియల్స్ లో హీరోగా.. టోన్డ్ బాడీతో.. అమ్మాయిల మనసుల్లో రొమాంటిక్ ఇమేజ్ సాధించాడు అర్జున్. 

45

అర్జున్ తో పాటు  సుప్రిత కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సిప్రీత సోషల్ మీడియాలో స్టార్ గా వెలుగు వెలుగుతోంది. అంతే కాదు ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు. తల్లీ కూతరు కలిసి నెట్టింట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరు ఈ వీక్ లోనే  హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

55

పలువురు సీరియల్ నటీనటులు ఉన్నారు. ఇప్పుడు అర్జున్ అంబటి కూడా వారిలో ఒకటి అవ్వబోతున్నాడు. స్టార్ మాలో సైతం పలు సీరియల్స్‌లో హీరోగా నటించి మెప్పించిన అర్జున్.. కేవలం యాక్టర్‌గా మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనలోని మల్టీ టాలెంట్స్‌ను బయటపెట్టాడు. ఇక ఈసారి సీజన్ లో సీరియల్ స్టార్స్ హవా ఎక్కువైపోయిందనే చెప్పాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Recommended image2
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image3
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved