MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 లో అడుగుపెట్టేది వీళ్లే.. ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా...

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 లో అడుగుపెట్టేది వీళ్లే.. ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే ఉంటుందన్న టాక్ ఉంది. దాంతో కంటెస్టెంట్స్ పై కసరత్తు స్టార్ట్ చేశారట. టీమ్ ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో పాల్గొనబోయే సెలబ్రిటీల లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. 

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2026, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చాలా స్పెషల్..
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చాలా స్పెషల్..

ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుందీ బిగ్ బాస్ తెలుగు.. ఇక సీజన్ 10 కోసం తెలుగు బిగ్ బాస్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. 

అయితే ఇప్పటికే కంటెస్టెంట్ల సెలక్షన్ మొదలయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి.. 10 ఏళ్లు అవుతున్న సంద్భంగా.. సీజన్ 10 ను స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేస్తున్నారట టీమ్. ఈసారి సెలబ్రిటీల మోతాదు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

 గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా ‘అగ్ని పరీక్ష’ పెట్టి.. కొంత మంది సామాన్యులకు అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సామాన్యులతో పాటు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే సెలబ్రిటీల లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వారెవరు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

28
బిగ్ బాస్ లోకి డాక్టర్ బాబు - వంటలక్క..
Image Credit : JIo Hotstar

బిగ్ బాస్ లోకి డాక్టర్ బాబు - వంటలక్క..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ లో మొదటగా వినిపిస్తున్న రెండు పేర్లు నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కు డాక్టర్ బాబు, వంటలక్కగా పరిచయం ఉన్న ఈ ఇద్దరు.. కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయ్యారు. వెండితెరపై హీరో, హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్.. బుల్లితెరపై వీరిద్దరికి ఉంది. ప్రస్తుతం కార్తీక దీపం 2 తో బిజీగా ఉన్న ఈ జంట.. బిగ్ బాస్ లోకి రావాలంటే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. అసలు టాప్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం2ను వదిలిపెట్టి వారు బిగ్ బాస్ లోకి వస్తారా?

Related Articles

Related image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..
Related image2
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
38
మహేష్ ఆచంట..
Image Credit : Asianet News

మహేష్ ఆచంట..

మహేష్ ఆచంట.. అలియాస్ రంగస్థలం మహేష్ అలియాస్ జబర్దస్త్ మహేష్. ఈ కమెడియన్ గురించి తెలియని వాళ్లు ఉండరు. జబర్ధస్త్ లో సాధారణ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఎంతో కష్టపడి రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కన పాత్రను సాధించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో... వరుస అవకాశాలతో మహేష్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలు తగ్గడంతో మహేష్ ఆచంట బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు సమాచారం.

48
వాసుకి ఆనంద్ ..
Image Credit : Asianet News

వాసుకి ఆనంద్ ..

వాసుకి ఆనంద్ ఈమధ్య కాలంలో రీ ఎంట్రీ ఇచ్చి... వరుసగా సినిమాలు చేస్తుంది. గతంలో హీరోల చెల్లెలు పాత్రలో ఆమె పాపులర్ అయ్యింది. తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో వాసుకి కనిపించింది. ఆతరువాత కొన్ని సినిమాలు చేసి.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని పెళ్లాడింది. ఇక రీసెంట్ గా 90 స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. 

అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. వరుసగా సినిమాలు చేస్తోంది వాసుకి. ఆమె బిగ్ బాస్ లోకి వస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓట్లు గంపగుత్తుగా సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే వాసుకి పవన్ చెల్లెలుగా నటించడమే కాదు.. వాసుకి భర్త ఆనంద్ సాయి పవర్ స్టార్ కు బెస్ట్ ఫ్రెండ్ కూడా.

58
ఇంద్రనీల్..
Image Credit : social media

ఇంద్రనీల్..

రుతురాగాలు, చక్రవాకం సీరియల్స్ తో పాపులర్ అయిన నటుడు ఇంద్రనీల్.. బుల్లితెరపై ఒకప్పుడు చాలా క్రేజ్ ఉన్న ఈ నటుడు.. చక్రవాకం సీరియల్ లో తనకు అత్త పాత్రలో నటించి మేఘన రామిని ప్రేమించి పెళ్లాడాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించిన ఇంద్రనీల్ కు ప్రస్తుతం అవకాశాలు లేవు..అప్పుడప్పుడు టీవీషోలలో సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఇంద్రనీల్ ఒక్కడే వస్తాడా లేక.. మేఘనతో పాటు జంటగా వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

68
కస్తూరి..
Image Credit : Asianet News

కస్తూరి..

బిగ్ బాస్ తెలుగు 10 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ లో సీరియర్ హీరోయిన్ కస్తూరి పేరు కూడా ఉంది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన కస్తూరి.. తెలుగులో గృహలక్ష్మి సీరియల్ తో మరోసారి సందడి చేసింది. సినిమాలతో పాటు కాంట్రవర్సీ కామెంట్స్ తో రచ్చ చర్చ చేస్తుంటుంది కస్తూరి. ఇప్పిటికే ఆమె ఒక సారి తమిళ బిగ్ బాస్ లోకి వెళ్లింది. ఈసారి తెలుగులో హడావిడి చేయబోతోందట. ఇక  ఆమె బిగ్ బాస్ లోకి వస్తే.. లెక్క వేరే ఉంటుంది.

78
బమ్ చిక్ బబ్లూ..
Image Credit : Asianet News

బమ్ చిక్ బబ్లూ..

బిగ్ బాస్ తెలుగు ప్రతీ సీజన్ లో సోషల్ మీడియా ఫ్లూ యోంజర్స్ సందడి చేయడం కామన్ .. ఈసారి కూడా సోషల్ మీడియా పాపులర్ నటుడు బబ్లూ సందడి చేయబోతున్నట్టు సమాచారం. అసలు ఇతను బిగ్ బాస్ 5 లోనే పాల్గొనాల్సి ఉంది. కానీ మిస్ అయ్యింది. ఈసారి బబ్లూ ఎంట్రీ పక్కా అంటున్నారు. వెబ్ సిరీస్‌లతో పాటు.. అనేక షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన బబ్లూ మయా అలియాస్ బమ్ చిక్ బబ్లూ (Sai Kumar Babloo) బిగ్ బాస్ 10 కంటెస్టెంట్‌గా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.

88
రక్ష గౌడ
Image Credit : our own

రక్ష గౌడ

తెలుగు బిగ్ బాస్ లో కన్నడ హవా ప్రతీ సీజన్ లో చూస్తూనే ఉన్నాం. సీజన్ 8 లో అయితే మొత్తం వాళ్లే కనిపించారు. ఇక ఈసారి కూడా కన్నడ సీరియల్ స్టార్స్ బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన నటి రక్ష గౌడ ఈసారి సీజన్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రెండు మూడు సీజన్లకు ఈమె పేరు వినిపించింది. కానీ ఈసారి పక్కగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. 

వీరితో పాటు టాలీవుడ్ పాపులర్ యాంకర్ దీపికా పిల్లి, పటాస్, జబర్దస్త్ కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి, టీవీ నటి ఆషికా పడుకొనే, ఫోక్ సింగర్ మంగ్లీ, సీరియల్ హీరోయిన్లు తేజస్వీ గౌడ, కావ్య పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారు. ఫైనల్ లిస్ట్ లో ఎంత మంది పేర్లు ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. ఇండియా వైడ్‌గా టాప్‌ 10లో ఏకంగా ఐదు
Recommended image2
Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌
Recommended image3
Pokiri Rejected Heroes: పోకిరిని మిస్‌ చేసుకున్న స్టార్ హీరోలు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆ హీరోదే, ఫ్లాప్‌ మూవీ కోసం
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..
Recommended image2
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved