- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9 `అగ్ని పరీక్ష`కి ఎంపికైన 15 మంది కంటెస్టెంట్ల లిస్ట్.. ఫైనల్ అయ్యేది ఎంతమందంటే?
బిగ్ బాస్ తెలుగు 9 `అగ్ని పరీక్ష`కి ఎంపికైన 15 మంది కంటెస్టెంట్ల లిస్ట్.. ఫైనల్ అయ్యేది ఎంతమందంటే?
`బిగ్ బాస్ తెలుగు 9 లో కామనర్స్ ఎంపికకి సంబంధించిన `అగ్నిపరీక్ష` కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. వీరి నుంచే కామనర్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.

బిగ్ బాస్ తెలుగు 9లో `అగ్నిపరీక్ష` దుమారం
`బిగ్ బాస్ తెలుగు 9` ప్రారంభానికి ముందే హాట్ హాట్‌గా మారింది. ఆడియెన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. నాగార్జున వరుసగా ప్రోమోలు వదులుతూ ఎంగేజ్ చేస్తున్నారు. తాజాగా `అగ్నిపరీక్ష` అనే కాన్సెప్ట్ దుమారం రేపుతుంది. ఈ సారి హౌజ్‌లోకి `కామనర్స్`(సామాన్య ప్రజలు) రాబోతున్న విషయం తెలిసిందే. సుమారు ఐదు మంది కామన్ మ్యాన్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్నారు. వారిని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుంది.
KNOW
అగ్నిపరీక్షని ఎదుర్కోబోతున్న కామనర్స్
ఆ మధ్య కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాన్ని కల్పిస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెట్టారు. దీనికి విశేష స్పందన లభించింది. కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో క్రమ క్రమంగా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంతిమంగా 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురుని ఫైనల్ చేస్తారు. వారే బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా అడుగుపెడతారు.
అగ్నిపరీక్షకి ఎంపికైన 15 మంది లిస్ట్
అయితే ఈ 15 మంది ఎవరనే లిస్ట్ లీక్ అయ్యింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ లిస్ట్ లీక్ చేశారు. వారు ఎవరనేది చూస్తే,
1.అనుషా రత్నం- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్
2 దివ్యా నిఖితా- వెజ్ ఫ్రైడ్ రైస్ మోమో గా ఫేమస్.
3. శ్రియా- ఎంపికైన వారిలో చిన్న వయసు ఉన్న అమ్మాయి.
4.స్వేతా శెట్టి- ఈమె యూకే నుంచి ఈ షో కోసం వచ్చారు. మంచి జిమ్ బాడీ బిల్డర్.
5.డెమాన్ పవన్- ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్.
6.ప్రసన్న కుమార్- యూనిక్ కంటెస్టెంట్. ఒక లెగ్ ఉండదు.
7.దమ్ము శ్రీజా- ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్.
8.మిస్ తెలంగాణ కల్కీ- మిస్ తెలంగాణలో రెండో స్థానం
9.దాలియా- జిమ్ కోచ్
10.ప్రియా శెట్టి, కామనర్.
11.మర్యాద మనిష్- బిజినెస్ మేన్
12. మాస్క్ మెన్ హృదయ్-కామనర్
13.పవన్ కళ్యాణ్- ఆర్మీ పర్సన్.
14.లాయర్ ప్రశాంత్- లాయర్
15.షాకీబ్- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్
`అగ్నిపరీక్ష`లో ఐదుగురు కంటెస్టెంట్ల ఎంపిక
ఈ 15 మంది కంటెస్టెంట్లని `అగ్నిపరీక్ష` టాస్క్ కి పంపిస్తున్నారు. ఇందులో కఠినమైన టాస్క్ లు ఇవ్వబోతున్నారు. కాన్ఫిడెన్స్, క్లిష్టసమయంలో పరిస్థితులను డీల్ చేయడం, అనేక రకాల సవాళ్లు, మానసిక ఒత్తిడితో కూడిన టాస్క్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా, భావోద్వేగాలు, ఉత్కంఠ అన్నీ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేకాదు దీన్ని హాట్ స్టార్‌లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వీరిలోనుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంపిక కాబోతున్నారు. వారే హౌజ్‌లోకి వస్తారు.
`బిగ్ బాస్ తెలుగు 9`లో కంటెస్టెంట్లుగా వినిపిస్తోన్న పేర్లు
ఇక వీరితోపాటు రెగ్యూలర్ సెలబ్రిటీలు కూడా వస్తారు. వారిలో అలేఖ్య పికిల్స్ చిట్టి రమ్య, టీవీ నటీమణులు దీపికా, దేబ్జానీ, కావ్య, తేజస్విని, శివ కుమార్, రీతూ చౌదరీ, కల్పికా గణేష్, హీరో సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, జబర్దస్త్ కమెడియన్‌ఇమ్మాన్యుయెల్, సింగర్ సాకేత్ తోపాటు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారట. ఈ సారి వివాదాలకు, గొడవలకు కొదవలేదని, అలాంటి బోల్డ్ కంటెస్టెంట్లని దించుతున్నట్టు సమాచారం. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ లో రచ్చ వేరే లెవల్ అని అర్థమవుతుంది. ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ సారి అరాచకమే అని హోస్ట్ నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండు హౌజ్‌లు ఉంటాయని, బిగ్ బాస్ కూడా మారుతున్నట్టు తెలిపారు నాగ్. మరి ఆ మార్పేంటనేది చూడాలి.

