- Home
- Entertainment
- Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Bigg Boss 9 Winner Prize Money : బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు? ఈసారి సీజన్ 9 విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంత దక్కబోతోంది. ప్రైజ్ మనీతో పాటు విన్నర్ కు దక్కబోయే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

చివరి దశలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డుకు దగ్గరలో ఉంది. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండగా.. వారిలో విన్నర్, రన్నర్ కోసం ఓటింగ్ నడుస్తోంది. ఈక్రమంలో ఫైనల్స్ కోసం భారీగా ఓటింగ్ నమోదు అవుతున్న క్రమంలో ఈసారి విన్నర్ ఎవరు అన్న విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్ లో ఉన్న టాప్ 5 లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, పవన్ ఈ ఐదుగురు టాప్ 5గా నిలిచారు.
బిగ్ బాస్ 9 టైటిలి గెలవబోయేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠకనమైన పోరులో ఐదుగురు మిగలగా.. వారికి ఓటింట్ కూడా భారీగా పోల్ అవుతోంది. అందులో ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనూజల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఓటింగ్ స్టార్ట్ అయిన టైమ్ లో తనూజ ముందు ఉండగా.. ప్రస్తుతం తనూజను పక్కకు నెట్టి కళ్యాణ్ పడాల భారీగా ఓట్లను సాధిస్తున్నాడు. వీరిద్దరిలో విన్నర్ రన్నర్ పోటీ ఉండటం ఖాయం అంటున్నారు. ఈక్రమంలో టైటిల్ కొట్టేంతగా తనూజ చేసిందేమి లేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. అంతే కాదు కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడం ఖాయం అని కామెంట్లు వస్తున్నాయి. కళ్యాణ్ కే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. నెట్టింట కూడా నెటిజన్లు కళ్యాణ్ కే ఎక్కువగా మద్దతు ప్రకటిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ప్రైజ్ మనీ..
ఇక బిగ్ బాస్ విన్నర్స్ కు ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. ప్రతీ సీజన్ లో టైటిల్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. ఇతర బెనిఫిట్స్ కొన్ని ఇస్తుంటారు. బిగ్ బాస్ లో ఇన్నాళ్లు ఉన్నందుకు.. వారి స్థాయిని బట్టి.. రెమ్యునరేషన్ అందుతుంది. దానికి తోడు ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుతుంది. ఇక విన్నర్ ను అనౌన్స్ చేయడానికి ముందు.. ఇద్దరిలో ఒకరికి భారీగా ప్రైజ్ మనీ కూడా ఆఫర్ చేస్తుంటారు. అది 40 లక్షల వరకూ ఉంటుంది. ఇక టైటిల్ విన్నర్ కు అప్పుడు స్పాన్సర్స్ అనౌన్స్ చేసినదాని ప్రకారం .. కారు కానీ.. ఓపెన్ ప్లాట్ కానీ అందే అవకాశం ఉంది. వీటితో పాటు స్టార్ మా కొన్ని ఈవెంట్స్ కు బుక్ చేసుకుంటూ.. బాండ్ కూడా రాయించుకుంటుందని సమాచారం. ఇలా బిగ్ బాస్ విన్నర్ కు ప్రైజ్ మనీతో పాటు రకరకాల బెనిఫిట్స్ అందుతాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కు ఈబెనిఫిట్స్ అన్నీ అందబోతున్నాయి. అందులో కొన్నిమార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ అందినా ఆశ్చర్చపోనవసరం లేదు.
బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్
బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే.. స్టార్ డమ్ ను, ఇమేజ్ ను బట్టి పారితోషికాలు మారుతుంటాయి. ఈసీజన్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ భరణీతో పాటు సుమన్ శెట్టి కూడా అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో చూస్తే.. ఓటింగ్ లో దూసుకుపోతూ.. టాప్ కంటెస్టెంట్ గా ఉన్న కళ్యాణ్ పడాల రెమ్యునరేషన్ చాలా తక్కువ అని తెలుస్తోంది. ఆయనకు రోజుకి పదివేలు మాత్రమే ఇస్తున్నారట. కామనర్ కోటాలో వచ్చిన డీమాన్ పవన్ కూడా రెమ్యునరేషన్ చాలా తక్కువని తెలుస్తోంది. పవన్ కు వారానికి రూ.70వేల వరకు ఉంటుందని సమాచారం. వీరిద్దరు 15 వారాలు ఉన్నారు. వీరికి రూ.10 లక్షల వరకూ పారితోషికం అంతే అవకాశం ఉంది.
అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికి..?
బిగ్ బాస్ లో టాప్ 5లో ఉన్న సంజనాకు రోజుకు 40 వేల వరకూ రెమ్యునరేషన్ అందుతోందట.. ఈలెక్కన్న ఆమెకు ఈ సీజన్ అంతా ఉన్నందుకు 35 లక్షలకు పైనే రెమ్యునరేషన్ అందే అవకాశం ఉంది. ఇక తనూజకు రోజుకు పారితోషికం 30-35 వేల వరకు ఉంటుందట. ఈ లెక్కన వారానికి తనూజ రెండున్నర లక్షల వరకు తీసుకుందని సమాచారం. ఇక కమెడియన్ గా బిజీగా ఉన్న ఇమ్మాన్యుయోల్ తన ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసుకుని వచ్చి.. మంచి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు రోజుకు 40 వేల చోప్పున.. మొత్తానికి కలిపి 40 లక్షల పైనే అందందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

