బిగ్ బాస్ హౌస్ లో పోలీసుల హంగామా, ఏం చేశారో తెలుసా.. మాధురి టీమ్ కి అవమానం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇచ్చి హంగామా చేశారు. వారు చేసిన హంగామా ఏంటి ? మాధురి టీంకి జరిగిన అవమానం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడండి.

బిగ్ బాస్ తెలుగు 9
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 46వ రోజు ఇంటి సభ్యులు ఫన్నీ గేమ్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఎపిసోడ్ చివర్లో సర్ప్రైజింగ్ ఎంట్రీ మరింత ఎంటర్టైన్ చేసింది. సైలెన్సర్ సంజన, మాస్ మాధురి టీమ్ ల మధ్య పోటీ కొనసాగుతోంది. ఎపిసోడ్ ప్రారంభంలో డస్ట్ బిన్ విషయంలో సంజన, దివ్య మధ్య వాగ్వాదం జరిగింది.
సంజన, దివ్య మధ్య గొడవ
డస్ట్ బిన్ లో చెత్త నిండిపోయినప్పటికీ ఇంకా క్లీన్ చేయలేదని సంజన ఫైర్ అయింది. చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని అడ్జెస్ట్ కావాలని దివ్య గొడవకి దిగింది. నేను అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడితే వాటిలో ఉన్న తప్పులు కూడా బయట పడతాయని దివ్య వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో బిగ్ బాస్ సంజన బ్లూ టీం, మాధురి రెడ్ టీం మధ్య గేమ్ నిర్వహించారు. వరుసగా బకెట్ లు ఉంటాయి.
బ్లూ టీం, రెడ్ టీం మధ్య గేమ్
రెడ్ టీం నుంచి ఒకరు, బ్లూ టీం నుంచి ఒకరు వచ్చి నోటిలో నీళ్లు నింపుకుని బాక్స్ లో పడేలా ఊయాలి. ఎవరు ఎక్కువ దూరం ఉన్న బకెట్స్ లో నీళ్లు ఊయగలిగితే వారు ఆ రౌండ్ లో విజయం సాధిస్తారు. ఎవరు ఎక్కువ రౌండ్స్ లో విజయం సాధిస్తే వల్లే అంతిమ విజేతలు. ముందుగా బ్లూ టీం నుంచి ఆయేషా, రెడ్ టీం నుంచి రీతూ పోటీ పడ్డారు. గత కొన్ని రోజులుగా అయేషా ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. దీనితో ఆయేషా గేమ్ ఆడకపోయినా పర్వాలేదు అని బిగ్ బాస్ తెలిపారు. తనకు ఇప్పుడు బాగానే ఉందని, గేమ్ ఆడతానని ఆయేషా ముందుకు వచ్చింది.
మోకాళ్లపై నిలబడ్డ మాధురి టీం
తొలి రౌండ్ లో ఆయేషా రీతూపై పై చేయి సాధించింది. సంజన టీం సభ్యులు ఎక్కువ మంది విజయం సాధించడంతో బ్లూ టీం విజేతలుగా నిలిచారు. దీనితో ఓడిపోయిన మాధురి టీం.. సంజన టీం ముందు మోకాళ్లపై నిలబడాలని బిగ్ బాస్ తెలిపారు. అంతే కాదు మోకాళ్లపై నిలబడి సంజన టీంని పొగడాలి అని అన్నారు. దీనితో అమమానంగా భవిస్తూనే మాధురి టీం బిగ్ బాస్ చెప్పినట్లు చేయాల్సి వచ్చింది.
హౌస్ లోకి ఇద్దరు పోలీసుల ఎంట్రీ
ఇక ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అర్జున్ అంబటి, అమర్ దీప్ పోలీస్ గెటప్స్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లిద్దరూ ఒక టాస్క్ పై హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. మారు వేషాల్లో ఉన్న సంజన, మాధురి లని వెతికి పట్టుకోవడమే వారికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. కాసేపు ఇంటి సభ్యులతో కలిసి, వారిని ఎంక్వైరీ చేస్తూ అర్జున్, అమర్ దీప్ వినోదం అందించారు. మాధురి, సంజన లని వాళ్లిద్దరూ సులభంగానే పట్టుకున్నారు.