- Home
- Entertainment
- ట్విన్స్‌కి జన్మనివ్వబోతున్న రాంచరణ్, ఉపాసన..మెగా ఫ్యామిలీలో డబుల్ సెలెబ్రేషన్స్, ఎలా హింట్ ఇచ్చారో చూడండి
ట్విన్స్‌కి జన్మనివ్వబోతున్న రాంచరణ్, ఉపాసన..మెగా ఫ్యామిలీలో డబుల్ సెలెబ్రేషన్స్, ఎలా హింట్ ఇచ్చారో చూడండి
రాంచరణ్, ఉపాసన దంపతుల నుంచి బిగ్ సర్ప్రైజ్. వీరిద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసన గర్భవతి కావడంతో ఆమెకి సీమంతం వేడుక జరిగింది. తమకి ట్విన్స్ జన్మించబోతున్నట్లు చరణ్, ఉపాసన హింట్ ఇచ్చారు.

మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్న రాంచరణ్, ఉపాసన
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల గురువారం రోజు అభిమానులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. మరోసారి రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. దీనితో మెగా ఫ్యామిలిలో సంతోషం, సంబరాలు నెలకొన్నాయి. ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భవతి. ఇక్కడ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది. వీరిద్దరూ ట్విన్స్‌కు తల్లిదండ్రులు కానున్నారు. ఈ మేరకు రాంచరణ్ టీం గుడ్ న్యూస్ ని ధృవీకరించింది.
ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న రాంచరణ్, ఉపాసన
ఇటీవల దీపావళి సందర్భంగా ఉపాసనకు సీమంతం వేడుక జరిగింది. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీతో పాటు నయనతార, నాగార్జున అమల దంపతులు, వెంకటేష్ నీరజ దంపతులు హాజరయ్యారు. సీమంతం వీడియోను ఉపాసన, రాంచరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోతోనే చరణ్, ఉపాసన తాము ట్విన్స్ కి తల్లిదండ్రులు కాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ దీపావళి సందర్భంగా తమ ఫ్యామిలీలో డబుల్ సెలెబ్రేషన్స్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అందాయి అని ట్విన్స్ గురించి హింట్ ఇచ్చారు. వీడియో చివర్లో కూడా రెండు జతల చిన్ని పాదముద్రలని ఉంచారు. అంటే కవల పిల్లలు రాబోతున్నారని అర్థం.
సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు
రాంచరణ్, ఉపాసన ట్విన్స్ కి తల్లిదండ్రులు కాబోతున్నట్లు వారి టీం సైతం ధ్రువీకరించింది. సోషల్ మీడియాలో ఈ సంతోషవార్త వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “డబుల్ డోస్ ఆఫ్ హ్యాపినెస్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆల్రెడీ రాంచరణ్ కి కుమార్తె
రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023లో వీరికి కుమార్తె క్లీంకార కొణిదెల జన్మించింది. ఇంతవరకు చరణ్ తన కుమార్తె ముఖాన్ని రివీల్ చేయలేదు.
రాంచరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది
సినిమాల విషయానికి వస్తే రాంచరణ్, ప్రస్తుతం “పెద్ది” చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ 2025 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తుండగా, ఇందులో శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.