MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భరణి ఎలిమినేషన్‌ వెనుక కుట్ర జరిగిందా? ఈ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే

భరణి ఎలిమినేషన్‌ వెనుక కుట్ర జరిగిందా? ఈ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే

భరణి గత వారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరోసారి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో శ్రీజతో పోటీ పడాల్సి వస్తోంది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 28 2025, 11:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంజనాపై భరణి ఫైర్
Image Credit : starmaa

సంజనాపై భరణి ఫైర్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఎనిమిదో వారంలో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చి నామినేట్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం ఎపిసోడ్‌లో కూడా భరణి, శ్రష్టి వచ్చి నామినేట్‌ చేశారు. శ్రష్టి.. పవన్‌ ని నామినేట్‌ చేయగా, ఆమె మరో నామినేషన్‌ రాముకి ఇచ్చింది. అతను గౌరవ్‌ని నామినేట్‌ చేశాడు. ఇక భరణి.. సంజనాని నామినేట్‌ చేశాడు. బాడీ షేమింగ్‌ కామెంట్లని ప్రధానంగా ఆయన లేవనెత్తాడు. ఆ విషయంలో తాను సారీ చెప్పినట్టు తెలిపింది సంజనా, కానీ సారీ చెబితే సరిపోదంటూ ఫైర్‌ అయ్యాడు భరణి. మరో నామినేషన్‌ నిఖిల్‌కి ఇవ్వగా, అతను తనూజని నామినేట్‌ చేశారు. గేమ్‌ ఆడే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వు గేమ్‌ ఆడటం లేదంటే, నువ్వు కనిపించడం లేదంటూ కామెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనూజ ఫైర్ అయ్యింది. నిఖిల్‌ ఇచ్చిన కౌంటర్లకి ఆమెకి కూడా ఫ్యూజులు ఔట్‌ అయ్యాయి. ఫస్ట్ టైమ్‌ నిఖిల్‌ ఇంత ఫైరింగ్‌లో కనిపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తనూజకి వ్యతిరేకంగా ఇమ్మాన్యుయెల్‌ గాసిప్పులు
Image Credit : starmaa

తనూజకి వ్యతిరేకంగా ఇమ్మాన్యుయెల్‌ గాసిప్పులు

అనంతరం రీతూ, పవన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకే విషయాన్ని పదే పదే రాద్ధాంతం చేస్తుందంటూ పవన్‌ అన్నాడు. ఆమె ఓ విషయం చెబుతుంటే, ఆయన వాదించాడు. దీంతో రీతూ సీరియస్‌ అయ్యింది. మరోవైపు తనూజ విషయంలో ఇమ్మాన్యుయెల్‌ గుసగుసలాడాడు. ఆమెకి వ్యతిరేకంగా గాసిప్‌లు నడిపించాడు. ఆమెపై క్రేజీ కామెంట్స్ చేశాడు. తనూజ మళ్ళీ భరణి రావాలని కోరుకుంటుంది. మరోవైపు దివ్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి తనతో మాట్లాడలేదని వాపోయింది. ఇంతలోనే బిగ్‌ బాస్‌ నుంచి అనౌన్స్ మెంట్‌ వచ్చింది. ఇందులో శ్రీజ, భరణి మళ్లీ హౌజ్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరు హౌజ్‌లో ఉండే అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. అయితే వారు ఏం మిస్టేక్స్ చేశారు? ఏం సరిచేసుకోవాలి అనేది హౌజ్‌మేట్స్ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరు ఎలిమినేషన్‌కి కారణాలను, మార్చుకోవాల్సిన విషయాలను వెల్లడించారు కంటెస్టెంట్లు.

Related Articles

Related image1
నోరు అదుపులో పెట్టుకో, శ్రీజకి దివ్వెల మాధురీ మాస్‌ వార్నింగ్‌.. హౌజ్‌ ఉండిపోయేదెవరు?
Related image2
అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ 5 ట్రెండింగ్‌ మూవీస్‌ ఇవే.. థియేటర్లో డిజాస్టర్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్న జాన్వీ మూవీ
35
భరణికి సంజనా కౌంటర్
Image Credit : jio hotstar

భరణికి సంజనా కౌంటర్

మొదటగా దివ్య.. భరణిలో అతి మంచి ఉంటుందని, అదే మైనస్‌గా మారుతుందని, ఆ మంచి తనం వల్ల గేమ్‌లో వెనకబడిపోతున్నాడని తెలిపింది. మరీ మంచితనం పనికిరాదు అని చెప్పింది. దాన్ని భరణి అంగీకరించారు. ఇమ్మాన్యుయెల్‌.. శ్రీజకి సలహా ఇచ్చారు. వాదించే విషయంలో శ్రీజ గొడవని కంటిన్యూ చేస్తుందని, దాన్ని కట్ చేసుకోవాలని తెలిపాడు. అందుకు శ్రీజ ఓకే చెప్పింది. డీమాన్‌ పవన్‌.. భరణి నమ్మకం కోల్పోయాడు అని, మూడు సార్లు అలా జరిగిందని తెలిపాడు. నామినేషన్స్ లో అది జరిగిందని చెప్పగా, నమ్మాలా వద్దా అనేది నీ ఇష్టం అని భరణి చెప్పడం విశేషం. సంజనా కూడా భరణికి సలహా ఇచ్చింది. సాక్రిఫైజ్‌ చేయడానికి సంబంధించి పదే పదే ఆ పేరు వాడితే దానికి ఉన్న విలువ పడిపోతుందని తెలిపింది. సుమన్‌ శెట్టి సైతం భరణికి చెబుతూ, మీ గేమ్ మీరు ఆడాలని, ఇతర విషయాల కారణంగా మీ గేమ్‌ మీరు ఆడటం లేదని తెలిపారు.

45
శ్రీజకి మాధురీ సలహా
Image Credit : Jiohotstar

శ్రీజకి మాధురీ సలహా

గౌరవ్‌.. భరణికి చెబుతూ, ఫిజికల్ టాస్క్ లు బాగా ఆడాలని తెలిపారు. దివ్వెల మాధురి.. శ్రీజని నోరుని అదుపులో పెట్టుకోవాలని తెలిపింది. ఏదైనా విషయం పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని తెలిపింది. నీలా మాట్లాడటం రాదు అని, తాను బాగానే మాట్లాడతానని తెలిపింది శ్రీజ. మాధురీకి కౌంటర్‌ ఇచ్చింది. ఇందులో తనూజ, దివ్యలతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాలి. తన బాండింగ్‌ని వాడుకుని వాళ్లు ఎలివేట్‌ అయ్యారని, కానీ తనకు బొక్క పెట్టారని చెప్పారు. అవే పట్టుకుని తనని ఎలిమినేట్‌ చేశారని వెల్లడించారు. తనపై స్ట్రాటజీ వాడి పంపించారని తెలిపారు. భరణి కామెంట్స్  వైరల్ గా మారాయి.  

55
8 వ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే
Image Credit : starmaa

8 వ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే

ఇక ఎనిమిదో వారం నామినేషన్‌ విషయానికి వస్తే ఈ వారం హౌజ్‌ని వీడేందుకు నామినేట్ అయిన వారిలో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో పవన్‌, తనూజ, కళ్యాణ్‌, రాము రాథోడ్‌, రీతూ చౌదరీ, సంజనా, దివ్వెల మాధురి, గౌరవ్‌ నామినేట్‌ అయ్యారు. వీరిలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
నోరు అదుపులో పెట్టుకో, శ్రీజకి దివ్వెల మాధురీ మాస్‌ వార్నింగ్‌.. హౌజ్‌ ఉండిపోయేదెవరు?
Recommended image2
అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ 5 ట్రెండింగ్‌ మూవీస్‌ ఇవే.. థియేటర్లో డిజాస్టర్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్న జాన్వీ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved