- Home
- Entertainment
- నోరు అదుపులో పెట్టుకో, శ్రీజకి దివ్వెల మాధురీ మాస్ వార్నింగ్.. హౌజ్ ఉండిపోయేదెవరు?
నోరు అదుపులో పెట్టుకో, శ్రీజకి దివ్వెల మాధురీ మాస్ వార్నింగ్.. హౌజ్ ఉండిపోయేదెవరు?
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో ఉండేందుకు శ్రీజ, భరణిలకు ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే అందుకు తాము అర్హులమని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ ప్రాసెస్ లో శ్రీజకి మార్నింగ్ వార్నింగ్ ఇచ్చింది దివ్వెల మాధురి.

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు
బిగ్ బాస్ తెలుగు 9లో రోజు రోజుకి ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వస్తున్నారు. ఈ వారం నామినేషన్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మర్యాద మనీష్, ప్రియా, ఫ్లోరా, శ్రీజ హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లని నామినేట్ చేశారు. ఇప్పుడు మంగళవారం ఎపిసోడ్‌లో భరణి, శ్రష్టి వర్మ హౌజ్‌లోకి వచ్చి సంజనా, డీమాన్ పవన్‌లను నామినేట్ చేశారు. నిఖిల్.. తనూజని నామినేట్ చేశారు.
హౌజ్‌లో ఉండేందుకు శ్రీజ, భరణిలకు ఛాన్స్
అనంతరం హౌజ్‌లోనే ఉండేందుకు ఎవరికి అర్హత ఉందనేది, వాళ్లు చేసిన తప్పులను చూపించాలని కంటెస్టెంట్లకి బిగ్ బాస్ చెప్పగా, హౌజ్‌లో ఉన్న వారి ఎలిమినేట్ అయిన శ్రీజ, భరణిలు చేసిన తప్పులను ఎత్తిచూపారు. ఇమ్మాన్యుయెల్ తన పాయింట్‌ని శ్రీజకి చెబుతూ, ఏదైనా విషయంలో వాదించడం మన హక్కు. కానీ దాన్ని కంటిన్యూ చేయడం వద్దు అని సూచించాడు, దాన్ని ఆమె తీసుకుంది. భరణికి పవన్ చెబుతూ, ట్రస్ట్ గా ఉండాలని, మీ విషయంలో మూడు సార్లు డిజప్పాయింట్ అయినట్టు తెలిపారు. మిమ్మల్ని నమ్మడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. నమ్ముతావా? వద్దా అనేది అది పూర్తిగా నీ ఇష్టమని తెలిపారు భరణి.
శ్రీజకి దువ్వాడ మాధురీ
ఇక ఫైర్ బ్రాండ్ దివ్వెల(దువ్వాడ) మాధురి వంతు వచ్చింది. ఆమె మైండ్ యువర్ వర్డ్స్ అంటూ శ్రీజకి సలహా ఇచ్చింది. దీనికి శ్రీజ స్పందిస్తూ, మీరు మాట్లాడే విధంగా నేనెప్పుడూ మాట్లాడను అని తెలిపింది. దీనికి మాధురి రియాక్ట్ అవుతూ, అవును అదే చూస్తున్నాం అంటూ ఆమెకి కౌంటర్ ఇచ్చింది. తానెప్పుడూ అంతగా నోరు జారలేదనేది తెలిపింది శ్రీజ. తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంది. ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వీరికి వచ్చిన సలహాలు సూచనలను బట్టి, వాటిని శ్రీజ, భరణి తీసుకొని మార్చుకునేదాన్ని బట్టి వీళ్లు హౌజ్‌లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా అనేది ఆధారపడి ఉంది. ఈ మంగళవారం ఎపిసోడ్‌లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తనూజకి నిఖిల్ నాయర్ కౌంటర్
అంతకు ముందు విడుదలైన ప్రోమోలో తనూజ, నిఖిల్ మధ్య వాదన గట్టిగా జరిగింది. నిఖిల్.. తనూజని నామినేట్ చేయగా, ముందు నువ్వు ఏం గేమ్ అడుతున్నావో చెక్ చేసుకోమంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే నువ్వేం ఆడుతున్నావంటూ స్పందించారు నిఖిల్. నేను ఆడుతూనే ఉన్నానని ఆమె చెప్పగా, ఏది ఎప్పుడూ కెప్టెన్ కాలేదని కౌంటర్ ఇవ్వడంతో తనూజ షాక్ అయ్యింది. ఇది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పవన్ రిలేషన్ గురించి శ్రష్టి వర్మ ఘాటు కామెంట్ చేసింది. ఆమె (రీతూ చౌదరీ) క్లారిటీతోనే ఉందని, నువ్వే తేల్చుకోలేకపోతున్నావని కామెంట్ చేయడం విశేషం.