MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. అనూహ్యంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాష, కావాలనే వెళ్ళిపోయాడా..?

బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. అనూహ్యంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాష, కావాలనే వెళ్ళిపోయాడా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్విస్ట్  లమీద  ట్విస్ట్ లు నడుస్తున్నాయి. అప్పుడే సెకండ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసింది. ఈ వీక్ అనూహ్యంగా  శేఖర్ భాష హౌస్ నుండి బయటకు వచ్చారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2024, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ వీక్ నుంచి కాస్త ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. టాస్క్ లలో కంటెస్టెంట్స్ ను బిజీ చేశారు బిగ్ బాస్. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఈక్రమంలో సెకండ్ వీక్ లో వీకెండ్ రానే వచ్చింది. ఈ వీకెండ్ ఇంటి నుంచి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు.
 

బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అసలు ముందు నుంచి నామినేషన్స్ లో ఉన్నవారిలో శేఖర్ భాష పేరు లేదు. ఆదిత్య ఓం, పృథ్విరాజ్ ల లోఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతారు అని అంతా అనుకున్నారు. ఇంకా శేఖర్ భాషా కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సీత పేరు కూడా ఎలిమినేషన్ కోసం వినిపించింది. 

కాని అందరు అనుకున్నదానికి రివర్స్ లో  శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ ను విడిచి వెళ్ళాల్సి వచ్చింది. శేఖర్ భాష పెర్ఫామెన్స్  విషయంలో ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అంతే కాదు ఛాన్స్ వచ్చినప్పుడల్లలా  హౌస్ మెంట్స్ శేఖర్ ను టార్గెట్ చేస్తూ. పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు అని కామెంట్స్ చేస్తూ వచ్చారు. 

36

అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. చిన్నది కాదు అది చాలా పెద్ద విషయమే అనుకోవాలి.  నామినేషన్స్ లో అందరు సేవ్ అయ్యి.. చివరగా శేఖర్ భాష‌ ఆదిత్య ఓం ఉండగా.. వారిలో ఎవరిని బయటకు పంపాలో హౌస్ మెంట్స్ కు ఓటింగ్ పెట్టారు. దాంతో సీత తప్పించి  అందరూ ఆదిత్యకు పాజిటీవ్ గా ఓటు వేసి .. ఆయన్ను అవమానించి బయటకు పంపించేశారు. 

కనీసం  మేజర్ ఓట్లు ఆదిత్యకు వచ్చిన తరువాత కూడా శేఖర్ కు ఫార్మాలిటీగా కూడా ఎవరూ ఓటు వేయలేదు. దాంతో ఆయన అంత పెద్ద తప్పుఏం చేశాడా అని ఆడియన్స్ కూడా కోపంగా ఉన్నారు. ఇక బయటకు వెళ్తూ.. శేఖర్ భాషా ఫేక్ ఎవరు.. రియల్ ఎవరు అని చెప్పాడు. 

46

రియల్ బోర్డ్ పై విష్ణు ప్రియ, సీత, ప్రేరణ ఫోటోలు.. ఫేక్ బోర్డ్ పై సోనియా, మణికంఠ, ఆదిత్య ఓం ఫోటోలు పెట్టాడు. సోనియా రెండు ముఖాలతో ఉంటోంది. ఆమె చాలా డేంజర్ అన్నట్టుగా చెప్పాడు. మణికంఠ కూడా ఫేస్ లో ఫేక్ ఎమోషన్స్ చూపిస్తున్నాడన్నారు. ఇక విష్ణు ప్రియ అమాయకురాలు అని అన్న శేఖర్.. సీత తన చెల్లెలిగా చెప్పుకున్నాడు. 

ఇక ఈ శనివారం ఎపిసోడ్ నాగార్జున శేఖర్ బాషాకు గుడ్  న్యూస్ చెప్పారు. శేఖర్ భాషా కు బాబు పుట్టినట్టు అనౌన్స్ చేశారు. ఆ ఆనందం తట్టుకోలేక బోరున ఏడ్చారు శేఖర్. ఈ గుడ్ న్యూస్ చెప్పడంతోనే అంతా హ్యాపీగా ఉన్న సమయంలో.. ఆయన ఎలిమినేషన్ పెద్ద షాక్ అని చెప్పాలి. 

56

ఇక సన్ డే ఫన్ డే నాగార్జున వచ్చి రావడంతోనే సండే ఫన్ గేమ్స్ తో ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో విష్ణు ప్రియతో ఓ ఆట ఆడుకున్నారు నాగ్. విష్ణు ప్రియ ఇచ్చిన సమాధానాలు.. ఆమె చేసని పెర్ఫామెన్స్ హౌస్ మెంట్స్ తో పాటు కంటెస్టెంట్స్ ను కూడా కడుపుబ్బా నవ్వించింది. 
 

66

ఇక ఎప్పటిలాగానే శేఖర్ బాష తన కుళ్లు జోస్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. అంతే కాదు ఇలా జోకులేస్తూనే వాళ్ల టీమ్ కు ఓ పాయింట్ కూడా మిస్ చేశారు శేఖర్. ఈవారు ఆయన వెళ్ళిపోవడంతో.. మళ్లీ నామినేషన్స్ కు సబంధించి లేటెస్ట్ టీజర్ చూపించాడు బిగ్ బాస్. అందులో మణికంఠకు, యష్మికి గట్టిగా వాదణ అయినట్టు తెలుస్తోంది. ఈసారి నామినేషన్లు మరింత వాడి వేడిగా జరగబోతున్నట్టు అర్ధం అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యూచర్ ని ముందే ఊహించిన కవి.. ఫ్లాప్ మూవీ పాట 100 శాతం నిజమైందిగా
Recommended image2
Krishnam Raju: కృష్ణంరాజుని ఒరేయ్‌ అని పిలిచే ఏకైక సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ విషయం తెలిసి మతిపోయింది
Recommended image3
శోభన్ బాబు తర్వాత టాలీవుడ్ అందగాడు ఎవరో తెలుసా? 11 భాషల్లో 1000కి పైగా సినిమాలు చేసిన హీరో ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved