అనూహ్య మలుపులు తిరుగుతున్న ఓటింగ్... టాప్ లో అతడు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 7లో మరో ఎలిమినేషన్ కి సిద్ధమైంది. నేడు శుక్రవారం కాగా ఓటింగ్ ముగియనుంది. నామినేషన్స్ లో 5 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుస్తుంది.
Bigg Boss Telugu 7
9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. రతిక రోజ్-తేజ డేంజర్ జోన్లోకి వచ్చారు. తేజ నిబ్బరంగా ఉన్నాడు. రతిక మాత్రం ఏడుస్తూ ఎలిమినేట్ చేయవద్దని నాగార్జునను కోరుకుంది. ఫైనల్ గా తేజ ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున వెల్లడించాడు. ఇక 10వ వారానికి శివాజీ, యావర్, గౌతమ్, రతిక, భోలే నామినేట్ అయ్యారు.
సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం ఓటింగ్ చాలా టఫ్ గా సాగుతుంది. రోజు రోజుకూ ఓటింగ్ మారిపోతుంది. కొన్ని అనధికార సర్వేల ప్రకారం 10వ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఎవరు ముందున్నారు? ఎవరు వెనుకబడ్డారు? అనేది చూద్దాం...
ఊహించినట్లే శివాజీ టాప్ లో దూసుకుపోతున్నాడు. శివాజీ ఒక్కడికే 42. 71 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందట. మిగతా నలుగురు శివాజీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో శివాజీకి ఎదురు లేకుండా పోయింది. శివాజీ ఎలిమినేట్ కావడం అసాధ్యంగా ఉంది.
శివాజీ తర్వాత గౌతమ్ ఉన్నాడని సమాచారం. గౌతమ్ కృష్ణకు 14.78 శాతం నమోదు అయ్యిందట. డాక్టర్ కమ్ యాక్టర్ అయిన గౌతమ్ కి బయట స్ట్రాంగ్ పీఆర్ టీమ్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఒకసారి హౌస్ కి కెప్టెన్ అయ్యి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. హౌస్లోకి వచ్చిన వాళ్ళ అమ్మ అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిందని చెప్పడం విశేషం..
అయితే శివాజీ మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాడు. మిగతా నలుగురి మధ్య స్వల్ప ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. యావర్ 14.39 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాడట. అంతకు ముందు భోలే మూడో స్థానంలో ఉన్నాడు. యావర్ ఓటింగ్ మెరుగవగా భోలేని వెనక్కి నెట్టాడు.
ఇక భోలే షావలికి 14.21 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందట. భోలే నాలుగో స్థానంలో ఉన్నాడట. ఇక అందరి కంటే వెనుకబడిన చివరి స్థానంలో రతిక ఉన్నదట. ఆమె ఓటింగ్ 13.91 శాతం అని సమాచారం. కాబట్టి ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం భోలే, రతిక డేంజర్ జోన్లో ఉన్నారు. రతిక ఎలిమినేట్ అవుతుంది.
అయితే గౌతమ్, యావర్, భోలే, రతికల ఓటింగ్ లో పెద్దగా వ్యత్యాసం లేదు. కాబట్టి ఈ నలుగురిలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఒక్క శివాజీ మాత్రమే భారీ ఓటింగ్ తో సత్తా చాటుతున్నాడు. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠకు ఆదివారం తెరపడనుంది..